9 Years Of PM Modi: తొమిదేళ్ల పాలనలో ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న 9 చారిత్రక నిర్ణయాలు..

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మే 30తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనుంది. ప్రజల జీవితాల్లో, దేశంలో అర్థవంతమైన మార్పులను తీసుకురావడానికి ప్రభుత్వం ఎన్నో కీలక, సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. మరెన్నో కీలక పథకాలుు ప్రవేశపెట్టింది. 2014లో అప్రతీహతమైన విజయం సాధించిన మోదీ నేతృత్వంలోని బీజేపీ..

9 Years Of PM Modi: తొమిదేళ్ల పాలనలో ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న 9 చారిత్రక నిర్ణయాలు..
Pm Modi
Follow us

|

Updated on: May 25, 2023 | 12:30 PM

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మే 30తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనుంది. ప్రజల జీవితాల్లో, దేశంలో అర్థవంతమైన మార్పులను తీసుకురావడానికి ప్రభుత్వం ఎన్నో కీలక, సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. మరెన్నో కీలక పథకాలుు ప్రవేశపెట్టింది. 2014లో అప్రతీహతమైన విజయం సాధించిన మోదీ నేతృత్వంలోని బీజేపీ.. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. మోదీ చరిష్మా.. అమత్ షా చాణక్యంతో దేశంలో శక్తివంతమైన పార్టీగా బీజేపీ అవతరించింది. ఈ జోష్‌ను ఇలాగే కంటిన్యూ చేసి మరోసారి విజయం సాధించాలని, హ్యాట్రిక్ కొట్టాలని కమలనాథులు దృఢ సంకల్పంతో ఉన్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనలో ఎన్నో కీలక నిర్ణయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో చారిత్రాత్మకమైన 9 అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

ఆర్టికల్ 370 రద్దు..

మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. జమ్మూ-కశ్మీర్, లడఖ్ ఏర్పాటు చేసింది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఆ రాష్ట్ర ప్రధాన రాజకీయ నాయకులందరినీ నిర్బంధించి, కశ్మీర్ లోయలో కఠినమైన లాక్‌డౌన్ విధించింది. ఈ చర్యతో కశ్మీర్ అభివృద్ధికి బాటలు వేసినట్లైంది.

పౌరసత్వ సవరణ చట్టం (CAA)..

మోడీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (CAA) తీసుకువచ్చింది. ఇది మరొక చరిత్రాత్మక చర్యగా పేర్కొనవచ్చు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లలో హింసించబడిన ముస్లిమేతర మైనారిటీలకు భారతీయ పౌరసత్వం మంజూరు చేయడానికి అనుమతించే వివాదాస్పద CAA. ఎనిమిది నెలల క్రితం పార్లమెంటు ఆమోదించగా.. ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్ర నిరసనలను ఎదురయ్యాయి. కాగా, గత ఐదేళ్లలో 4,844 మంది విదేశీయులకు భారత పౌరసత్వం ఇచ్చామని ప్రభుత్వం 2022లో లోక్‌సభకు తెలిపింది.

ఇవి కూడా చదవండి

వస్తువులు, సేవా పన్ను (GST)..

మోడీ ప్రభుత్వం వస్తు సేవల పన్ను (GST)ని అమలు చేసింది. ఇది స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పన్ను సవరణ. ఈ నిర్ణయంతో కేంద్రం, రాష్ట్ర పన్నులు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. ఇక లక్షలాది మంది వ్యాపారులను పన్ను పరిధిలోకి తెచ్చింది. ప్రభుత్వ ఆదాయం కూడా భారీగా పెరిగింది.

అద్భుతమైన హైవేల నిర్మాణం..

ప్రధాని మోదీ పాలనలో జాతీయ రహదారుల విస్తరణ వేగవంతమైంది. రహదారి పొడవును లెక్కించే పద్ధతిలో మార్పు వచ్చింది. మార్చి 2022లో కేంద్ర మంత్రి గడ్కరీ లోక్‌సభలో చేసిన ప్రకటన ప్రకారం.. ప్రభుత్వం ఎనిమిదేళ్లలో 49,903 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించింది. అంటే మోదీ పాలనలో జాతీయ రహదారులు రోజుకు 17.1 కిలోమీటర్ల నిర్మాణం జరిగిందన్నమాట.

బాలాకోట్ వైమానిక దాడులు, 2016 సర్జికల్ స్ట్రైక్స్..

సెప్టెంబరు 2016లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత ప్రత్యేక బలగాలు ‘సర్జికల్ స్ట్రైక్స్’ నిర్వహించగా, ఫిబ్రవరి 2019లో పాకిస్థాన్ ఖైబర్-పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం ‘వైమానిక దాడులు’ నిర్వహించింది.

EWS కోటా..

రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా ప్రభుత్వం 2019లో EWS కోటాను ప్రవేశపెట్టింది. ఆర్థికంగా బలహీనమైన అగ్ర వర్ణాల ప్రజలకు విద్య, ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లు అందిస్తుంది. EWS కోటాకు అర్హత పొందడానికి, ఒక వ్యక్తి, కుటుంబం ఆదాయం సంవత్సరానికి రూ. 8 లక్షలు మించకూడదు.

స్వచ్ఛ భారత్ మిషన్..

దేశంలో పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించేందుకు 2014లో గాంధీ జయంతి రోజున ప్రధాని మోదీ ‘స్వచ్ఛ భారత్ అభియాన్‌’ను ప్రారంభించారు. ఈ మిషన్‌లో భాగంగా ఐదేళ్లలో 100 మిలియన్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా బహిరంగ మలవిసర్జన రహిత గ్రామీణ భారతదేశాన్ని సాధించడం జరిగింది. 11.5 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించామని ప్రభుత్వం చెబుతోంది. మిషన్ రెండవ దశలో అన్ని నగరాలను చెత్త రహితంగా, చిన్న పట్టణాలను ODFగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.

బ్యాంకుల విలీనం..

బ్యాంకల విలీనాన్ని 2020లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఏడు పెద్ద PSBలను సృష్టించారు. ఇది గ్లోబల్ బ్యాంక్‌లతో పోల్చదగిన స్థాయిని సాధించడంలో, ప్రపంచ పోటీతత్వాన్ని ఎదుర్కొని నిలవడంలో బ్యాంకులకు సహాయపడుతుంది. ‘‘బ్యాంకు విలీనాలు బ్యాంకింగ్ రంగానికి ప్రయోజనకరంగా ఉన్నాయి. విలీనం వలన బ్యాంక్ కస్టమర్లకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వాటాదారులకు లాభాలు అందుతాయి. బ్యాంకుల సామర్థ్యం కూడా పెరుగుతుంది’’ అని ఆర్‌బీఐ పేర్కొంది.

ట్రిపుల్ తలాక్ చట్టం..

తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే బిల్లు 2019 జూలైలో పార్లమెంటులో ఆమోదం పొందింది. ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లును లోక్‌సభ గతంలోనే ఆమోదించింది. జులైలో రాజ్యసభ సైతం ఆమోదం తెలిపింది. దాంతో తలాక్ పేరుతో తక్షణ విడాకులు తీసుకునే ముస్లిం పురుషులకు మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
సుందరకాండ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?