Accident: ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ చూసుండరు.. గుండె ధైర్యం చేసుకొని చూడండి
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే వారితో పాటు ఇతరులకు కూడా ముప్పే ఉంటుంది. ఇలాంటి ఘటనలు తరచుగా ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా కర్ణాటకలో చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదం మాత్రం అందరిని కలిచివేస్తోంది.

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే వారితో పాటు ఇతరులకు కూడా ముప్పే ఉంటుంది. ఇలాంటి ఘటనలు తరచుగా ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా కర్ణాటకలో చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదం మాత్రం అందరిని కలిచివేస్తోంది. రాయ్‌చూర్ జిల్లాలో ఓ బైకర్ నిర్లక్ష్యం వల్ల వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి. రోడ్డుపై వెళ్తున్న విద్యార్థినులను ఢీకొట్టడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే రాయ్‌చోర్‌లోని రాఘవేంద్ర పెట్రోల్ బంక్ సమీపంలో ఓ కారు వేగంగా వస్తోంది. అయితే అవతి వేపు నుంచి కూడా ఓ వ్యక్తి బైక్‌పై వస్తున్నాడు.
అయితే బైక్‌పై వస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుని రోడ్డు మధ్యలోకి వచ్చేశాడు. దీంతో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి.. ఆ బైక్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత వెంటనే పక్కనే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నలుగురు పాఠశాల విద్యార్థులపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్‌పై వస్తు్న్న ఆ వ్యక్తి గాల్లో ఎగిరిపడిపోయాడు. అలాగే వెనకనుంచి కారు ఢీకొట్టడంతో ఓ విద్యార్థి పక్కకు పడిపోయింది. మరో విద్యార్థి గాల్లోకి ఎగిరిపడింది . ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరు విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.




#BreakingNews Speeding Car Runs Over 3 As Biker Takes Sudden U-Turn In Karnataka’s Raichur.
Is it the fault of the car or the biker?#Thoughts_That_Taught #ViralVideos #accident #HyderabadRains #TejRan #NetwebTechnologies #APJAbdulKalam pic.twitter.com/D0P2wsP0Qy
— Kareena (@ILovMyIndia12) July 27, 2023
బీఎండబ్ల్యూ కారులో మంటలు..
రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ జిటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఖరీదైన కారులో ఉన్నట్టుండి దట్టమైన పొగలతో కూడిన మంటలు చెలరేగడంతో..కారులో ఉన్నవారు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వారు కూడా భద్రత కోసం పరుగులు తీశారు. కాలిపోతున్న ఆకుపచ్చ రంగు బిఎమ్‌డబ్ల్యూ కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నైలోని రద్దీగా ఉండే ఓ రహదారిలో గ్రీన్ కలర్ లగ్జరీ బీఎండబ్ల్యూ కారు మంటల్లో దగ్ధమైంది. కారులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ బయటకు దూకాల్సి వచ్చింది. పొగతో కాలిపోతున్న కారు వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. ఈ ఘటన జూలై 26న జరిగింది.




