Watch Video: బస్సు పై కప్పు ఊడింది.. తగ్గిదే లే అంటూ ముందుకు వెళ్తున్న డ్రైవర్.. చివరికి
మహారాష్ట్రలోని ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న బస్సుకు దాని పైకపప్పు ఊడిపోయినప్పటకీ డ్రైవర్ అలానే ముందుకు నడపడం అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తోంది.

మహారాష్ట్రలోని ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న బస్సుకు దాని పైకపప్పు ఊడిపోయినప్పటకీ డ్రైవర్ అలానే ముందుకు నడపడం అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళ్తే గడ్చిరోలి జిల్లా అపేరి డిపోకు చెందిన ఎమ్‌ఎస్‌ఆర్టీసీకి చెందిన ఓ బస్సు రోడ్డుపై ప్రయాణిస్తుంది. అయితే దాని పైకప్పు సగానికి పైగా విరిగిపోయింది. అయినా కూడా అలానే రోడ్డుపై వెళ్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై ఎమ్‌ఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్ శేఖర్ ఛన్నే స్పందించారు. గడ్చిరోలీ – అహేరీ మధ్య నడిచే బస్సు పై భాగం ఊడిపోయిన ఘటన మా దృష్టికి వచ్చిందని చెప్పారు. దీనిపై విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు.
అలాగే భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై అపేరి డిపో అధికారులు సైతం స్పందించారు. బస్సు పై భాగం మొత్తం ఊడిపోలేదని.. కేవలం ముందుభాగంలో మత్రమే ఫైబర్ ఊడినట్లు తెలిపారు. అసలు ఆ పైకప్పు ఊడిన సంగతి డ్రైవర్‌కు గాని, ప్రయాణికులకు గాని తెలియదని చెప్పారు. అయితే పక్కన వెళ్తున్న వాహనాలు ఈ విషయం చెప్పడంతో.. బస్సు సిబ్బందే వీడియో తీయాలని సూచించినట్లు విచారణలో తెలిసింది. ఆ ఘటనకు సంబంధించి ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశామని అధికారులు తెలిపారు.




Shocking! Maharashtra State Road Transport Corp. (MSRTC) bus runs with a broken roof!#MumbaiRains #BaarishAaGayiHai #BarishAaGayiHai #WorldCup2023 pic.twitter.com/x96BpuxAFF
— Voice of Mumbai (@GreaterMumbai) July 26, 2023