PMVVY Scheme: మరో అద్భుత స్కీం.. ప్రతీ నెలా రూ. 9250 పెన్షన్ పొందొచ్చు.. వివరాలు ఇవే.!
Pradhana Mantri Vaya Vandana Yojana: 60 ఏళ్లు దాటిన పెద్దలకు జీవితంపై భరోసా కల్పించే ఉద్దేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలులోకి...

Pradhana Mantri Vaya Vandana Yojana: 60 ఏళ్లు దాటిన పెద్దలకు జీవితంపై భరోసా కల్పించే ఉద్దేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన పధకం ప్రధాన మంత్రి వయో వందన యోజన (PMVVY). ఈ పధకానికి సంబంధించిన గడువును ఇటీవలే కేంద్రం మరో మూడేళ్ల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ పధకం చివరి తేదీ 2021 మార్చి 31 కాగా.. ఇప్పుడు ఈ పధకంలో చేరేందుకు 2023 మార్చి 31 వరకు అవకాశం ఉంది.
దిగ్గజ బీమా కంపెనీ ఎల్ఐసీ ఈ స్కీంను గవర్నమెంట్ తరపున అందిస్తోంది. ఈ పథకం కేవలం సీనియర్ సిటిజన్స్ కోసం మాత్రమే. ఇందులో గరిష్ఠంగా రూ.15 లక్షలు డిపాజిట్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌తో పాటు ఎల్‌ఐసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఈ పథకంలో చేరవచ్చని ఎల్‌ఐసీ వివరించింది. ఈ పాలసీ 10 ఏళ్లు కాలవ్యవధితో ఉంటుంది. 2021 మార్చి ఆర్థిక సంవత్సరంలోపు కొనుగోలు చేసే పాలసీలకు 7.4 శాతం వార్షిక వడ్డీ రేటు అందిస్తారు. ఈ వడ్డీ ప్రతి నెలా పింఛను రూపంలో పాలసీదారులకు అందుతుంది. ఆ తర్వాత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 2022, 2023 మార్చి లోపు విక్రయించే పాలసీలకు ఆయా ఆర్థిక సంవత్సరాల ప్రారంభంలో ప్రభుత్వం వడ్డీ రేటు నిర్ణయిస్తుందని ఎల్‌ఐసీ తెలిపింది.
ఈ పథకంలో చేరేందుకు పింఛనుదారు నెలవారీ/త్రైమాసిక/అర్ధవార్షిక/వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లింపు ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. నెలవారీ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే కనీసం రూ.1,62,162, త్రైమాసిక ఆప్షన్ ఎంచుకుంటే రూ.1,61,074, అర్ధవార్షిక ఆప్షన్‌లో రూ.1,59,574, వార్షిక ఆప్షన్ అయితే రూ.1,56,658 కనీస మొత్తానికి పాలసీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో కనిష్టంగా రూ. 1000 నుంచి గరిష్ఠంగా రూ.9,250 నెలవారీ పింఛను అందుకోవచ్చు.
గతంలో ఈ పథకంలో చేరే పెద్దలకు 8 శాతం వడ్డీ ఇస్తుండగా, నెలకు గరిష్ఠంగా రూ.10,000 పింఛను అందేది. ఇప్పుడు దాన్ని 7.4 శాతానికి తగ్గించడంతో నెలవారీ గరిష్ఠ పింఛను రూ.9,250కి తగ్గుతోంది. పాలసీ కొనుగోలు చేసిన మూడేళ్ల తర్వాత దీనిపై 75 శాతం వరకు రుణం పొందే సదుపాయం కూడా ఎల్‌ఐసీ కల్పిస్తోంది. అంతే కాకుండా పాలసీదారులకు లేదంటే వారి భాగస్వాములకు తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తితే, చికిత్స నిమిత్తం పాలసీ నుంచి ముందస్తుగా బయటకు రావడానికి అవకాశం కల్పిస్తోంది. కొనుగోలు చేసిన ధరలో 98 శాతం తిరిగి చెల్లిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి:
చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!
భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!
తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!