వందేభారత్ స్లీపర్‌తో విమానం లాంటి ప్రయాణం.. ధరలు ఇలా..
Ravi Kiran
2 January 2026
మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి రెండో వారంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇది సాధారణ రైలైతే కాదు. సుదీర్ఘ ప్రయాణం. ప్రత్యేకంగా రూపొందించిన పూర్తి ఎయిర్ కండిషన్డ్ సెమీ హై స్పీడ్ ట్రైన్ ఇది.
హౌరా నుంచి గౌహతి వరకు ఒకే రాత్రిలో అసోం – పశ్చిమ బెంగాల్ మధ్య దూరాలను కరిగించేలా ఈ రైలు పరుగులు పెట్టనుంది. టోటల్ డిస్టన్స్ వెయ్యి కిలోమీటర్లు. మొత్తం 16 కోచ్‌లు ఉండనున్నాయి.
ఈ స్లీపర్ ట్రైన్ విజయవంతంగా ట్రయల్ రన్స్ పూర్తి చేసుకుంది. 1,200 నుంచి 1,500 కిలోమీటర్ల సుదీర్గ ప్రయాణానికి ఇది పట్టాలపై 160 kmph గరిష్ట వేగంతో నడవనుంది.
ఈ రైలు ఆగే స్టేషన్స్ ఇవే.. హౌరా, కట్వా, అజిమ్ గంజ్, ఫరక్కా, మాల్దా టౌన్, జల్పాయ్‌గుడి, కూచ్ బెహర్, బోంగైగావ్, కామాఖ్య స్టేషన్లలో ఇది ఆగనుంది. దీని ట్రయల్ రన్ 180 kmph వేగంతో పూర్తయింది.
కోటా – నాగ్డా సెక్షన్‌లో ట్రయల్ రన్ సమయంలో రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. వేగం ఎంత ఉన్నా నీరు తొణకలేదు. నీటితో నిండిన గ్లాసులు పెట్టినా ఒక్క చుక్క కూడా చిందలేదు.
ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే. వందే భారత్ స్లీపర్‌లో ఫీచర్లు చూస్తే రైలు కాదు.. విమానం అనిపిస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్ తరహా బయో వాక్యూమ్ టాయిలెట్లు, నడిచే లగ్జరీ బెడ్‌రూమ్ అది. నైట్ మోడ్ లైటింగ్‌తో కళ్లకు స్ట్రెస్ లేకుండా నిద్ర పడుతుంది.
ప్రతి బెర్త్ దగ్గర రీడింగ్ లైట్.. చార్జింగ్ పాయింట్లు, సీసీటీవీ భద్రత, ఆటోమేటిక్ డోర్లు, హైస్పీడ్‌లో కూడా జర్క్ లేని స్టేబుల్ కోచ్ డిజైన్. దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు.. బేబీ కేర్ ఏరియా కూడా ఉంటుంది.
ఫస్ట్ క్లాస్‌లో అయితే హాట్ వాటర్ షవర్ కూడా ఉంది. నేరుగా లోకో పైలట్‌ను సంప్రదించే కమ్యూనికేషన్ సిస్టమ్. ఎయిర్‌క్రాఫ్ట్ తరహా బయో-వాక్యూమ్ టాయిలెట్ టెక్నాలజీ ఉంది.
స్వదేశీ కవాచ్ యాంటీ-కాలిజన్ సిస్టమ్‌తో ప్రమాదాలకు చెక్ పెడుతుంది. ఇంత లగ్జరీ సౌకర్యాలున్నప్పుడు, ప్రయాణం చాలా కాస్ట్లీ అనుకోవద్దు. చాలా రీజనబుల్ రేట్లతోనే ప్రయాణించవచ్చని రైల్వే మంత్రి తెలిపారు.
ఏసీ త్రీ టైర్‌కు రూ.2.300.. ఏసీ టూ టైర్‌కు రూ.3వేలు, ఏసీ ఫస్ట్ క్లాస్‌కు రూ.3,600 ఉంటుంది. AC 3టైర్ – 11 కోచ్‌లు, AC 2 టైర్- 4 కోచ్‌లు, AC ఫస్ట్ క్లాస్ – 1 కోచ్‌తో మొత్తం ప్రయాణికుల సామర్థ్యం 823 మందిగా ఉంది.