AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: ఆటో డ్రైవర్ భార్యను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న ఫైనాన్షియర్.. ఆ తరువాత మరీ దారుణం..

Gujarat: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తాను తీసుకున్న అప్పు రూ. 50 వేలు తిరిగి చెల్లించకపోవడంతో.. ఫైనాన్షియర్ రెచ్చిపోయాడు.

Shocking: ఆటో డ్రైవర్ భార్యను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న ఫైనాన్షియర్.. ఆ తరువాత మరీ దారుణం..
Gujarat Financer
Shiva Prajapati
|

Updated on: Dec 18, 2022 | 6:19 PM

Share

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తాను తీసుకున్న అప్పు రూ. 50 వేలు తిరిగి చెల్లించకపోవడంతో.. ఫైనాన్షియర్ రెచ్చిపోయాడు. అప్పు తీసుకున్న వ్యక్తి ఇంట్లోకి దూరి అతని బలవంతంగా ఎత్తుకెళ్లాడు ఫైనాన్షియర్. ఓ గుడిలో ఆమె నుదిటిన కుంకుమ పెట్టి తన భార్యగా ప్రకటించుకున్నాడు. అంతటితో ఆగకుండా.. ఇంటికి తీసుకెళ్లి.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అహ్మదాబాద్‌‌లో ఆటోరిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి.. అజింగ్ సింగ్ చావ్డా అనే ప్రైవేట్ ఫైనాన్షియర్ వద్ద రూ. 50 వేలు అప్పు తీసుకున్నాడు. ఈ సందర్భంగా రోజుకు రూ. 1500 వడ్డీ చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. అయితే, సదరు ఆటో డ్రైవర్ రూ. 1500 వడ్డీ చెల్లించడంలో విఫలమయ్యాడు. ఆ డబ్బు చెల్లించలేకపోయాడు. దాంతో ఆగ్రహానికి గురైన ఫైనాన్షియర్ అజిత్ సింగ్.. ఆటోవాలా ఇంటికి వెళ్లాడు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి అతని భార్య(37)ను ఎత్తుకెళ్లాడు. నేరుగా ఓ ఆలయానికి తీసుకెళ్లి.. అక్కడ ఆమె నుదుటిపై సింధూరం పెట్టాడు. ఆమెను తన భార్యగా ప్రకటించుకున్నాడు. ఆ తరువాత.. ఇంటికి తీసుకెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని తన సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించాడు.

ఆ కీచకుడి చెర నుంచి బయటపడిన మహిళ.. నేరుగా రాజ్‌కోట్ తాలూకా పోలీసులను ఆశ్రయించింది. అయితే, పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. దాంతో బాధిత మహిళ కోర్టును ఆశ్రయించింది. ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. దాంతో పోలీసులు కీచక ఫైనాన్షియర్‌పై కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

తనపై ఎఫ్ఐఆర్ నమోదవడంతో బెదిరిపోయిన ఫైనాన్షియర్.. బాధిత మహిళ, ఆమె భార్యతో కాళ్లబేరానికి వచ్చాడు. జరిగిన ఘటనకు పరిహారంగా డబ్బు చెల్లిస్తానని, తీసుకున్న అప్పు కూడా చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆఫర్లు ఇచ్చాడు. అయితే, ఈ సమయంలో బాధితులకు, ఫైనాన్షియర్ అజిత్ సింగ్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో రెచ్చిపోయిన ఫైనాన్షియర్.. తన ఇద్దరు అనుచరులతో కలిసి బాధిత మహిళపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఆమె చేతికి తీవ్రంగా గాయం అయ్యింది. ఈ ఘటన అంతా స్థానికంగా ఉన్న సిసికెమెరాలో రికార్డ్ అవగా.. ఈ ఫుటేజీ ప్రకారం పోలీసులు మరో సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అతనిపై చర్యలకు ఉపక్రమించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..