Yamaha Neo Electric Bike: యమహా ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది! ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్!
ఇప్పటికే హీరో, హోండా, టీవీఎస్, బజాజ్ వంటి దిగ్గజ సంస్థలు ఎలక్ట్రిక్ బైక్ మోడళ్లలో తమ వేరియంట్లను సిద్ధం చేశాయి. ఇదే వరుసలో యమహా మోటర్ ఇండియా కూడా చేరింది.

పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యులకు అందని రీతిలో పైపైకి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అందరూ ఎలక్ట్రిక్ బైక్ ల వైపు మళ్లుతున్నారు. అందుకు అనుగుణంగా పలు ద్విచక్ర వాహన తయారీ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే హీరో, హోండా, టీవీఎస్, బజాజ్ వంటి దిగ్గజ సంస్థలు ఎలక్ట్రిక్ బైక్ మోడళ్లలో తమ వేరియంట్లను సిద్ధం చేశాయి. ఇదే వరుసలో యమహా మోటర్ ఇండియా కూడా చేరింది. యమహా తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను త్వరలో తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. యమహా నియో ఎలక్ట్రిక్ స్కూటర్ గా నామకరణం చేసిన ఈ బండిపై ప్రస్తుతం పలు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు యమహా ఇండియా చైర్మన్ ఈషిన్ చిహాన పేర్కొన్నారు. అన్ని కుదిరితే 2025 నాటికి తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇండియా రోడ్లకు తగినట్లుగా..
జపాన్ ఇప్పటికే ఉన్న ఈ స్కూటర్ ను మన దేశంలో రోడ్లకు, డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ వంటి వాటిని అప్ డేట్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడి మార్కెట్లో డిమాండ్, ఇతర కంపెనీ మోడళ్ల ధరలకు అనుగుణంగా తమ స్కూటర్ ఉండేటట్లు యమహా కంపెనీ జాగ్రత్తలు తీసుకొంటోంది.
స్పెసిఫికేషన్లు ఇవి..
కొత్త యమహా నియో స్కూటర్ 50 సీసీ సాధారణ బైక్ తో సమానం. దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ దాదాపు 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగి ఉంది. బ్యాటరీలు కూడా మార్చుకోదగినవి ఉంటాయి. 68 కిలోమీటర్ల అత్యధిక వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఎల్ఈడీ లైటింగ్, స్మార్ట్ ఫోన్ కనెక్టెవిటీ, స్మార్ట్ కీ ఆప్షన్ కలిగి ఉంటుంది. సీట్ కింద 27 లిటర్ల స్టోరేజ్ స్పేస్ అందుబాటులో ఉంటుంది.



ఆర్ ఎక్స్ 100కు కొత్త రూపు..
జపాన్ కు చెందిన యమహా కంపెనీ తన విజయవంతమైన మోడల్ యమహా ఆర్ ఎక్స్ 100 బైక్ ను అప్ గ్రేడ్ చేసి మళ్లీ తీసుకొస్తున్నట్లు పేర్కొంది. పాత మోడల్ కు మించిన రేంజ్ లో, అధిక శక్తి కలిగిన ఇంజిన్తో దీనిని తీసుకురానున్నట్లు వివరించింది. అన్నీ కుదిరితే 2026లో కొత్త మోడల్ ఆర్ ఎక్స్ 100 మన దేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..



