Electric Bike: తొలి ఎలక్ట్రిక్ గేర్ల బైక్ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే.. ఫీచర్స్ ఇవే..

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు వాయు కాలుష్యం పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఇటీవల కాలంలో పెరుగుతుంది. ఈవీ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు నానాటికీ డిమాండ్ పెరిగుతోంది. దీంతో కొత్తకొత్త మోడళ్లు..

Electric Bike: తొలి ఎలక్ట్రిక్ గేర్ల బైక్ మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడంటే.. ఫీచర్స్ ఇవే..
Electric Bike
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 22, 2022 | 7:40 AM

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు వాయు కాలుష్యం పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఇటీవల కాలంలో పెరుగుతుంది. ఈవీ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు నానాటికీ డిమాండ్ పెరిగుతోంది. దీంతో కొత్తకొత్త మోడళ్లు దేశీయ మార్కెట్‍లోకి వస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లకు క్రేజ్ మరింత ఎక్కువగా ఉంది. ఈ తరుణంలో ఇండియాలో తొలిసారి గేర్లతో కూడిన ఎలక్ట్రిక్ మోటార్ బైక్ రాబోతుంది. టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ మ్యాటర్ గేర్లతో కూడిన ఎలక్ట్రిక్ బైక్‍ను ఆవిష్కరించింది. అహ్మదాబాద్‍లోని కంపెనీ ఫ్యాక్టరీలో ఈ బైక్‍లను ఉత్పత్తి చేస్తోంది. ఈ క్రమంలో తొలి ఎలక్ట్రిక్ గేర్ల బైక్ మార్కెట్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. 4 స్పీడ్ గేర్ బాక్స్ తో కూడిన ఎలక్ట్రిక్ బైక్‍ను మ్యాటర్ కంపెనీ తీసుకురానుంది. గేర్లతో భారత్‌లో అందుబాటులోకి రానున్న తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే కానుంది.

ఫీచర్లు

ఏడు ఇంచుల టచ్ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో కూడిన వెహికల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్.. ఈ మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్‍కు ఉంటుంది. ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్‍ తో వస్తుంది. స్మార్ట్ ఫోన్‍ను ఈ బైక్‍కు కనెక్ట్ చేసుకోవచ్చు. స్పీడ్, గేర్ పొజిషన్, రైడింగ్ మోడ్, నావిగేషన్, నోటిఫికేషన్ ఎలర్ట్స్, మ్యూజిక్ ప్లే బ్యాక్, కాల్ కంట్రోల్ లాంటి ఫంక్షన్స్ ఈ బైక్ డిస్‍ప్లే నుంచే చేసుకోవచ్చు. ఈ బైక్‍కు ఓటీఏ అప్‍డేట్స్ కూడా వస్తాయి. రివర్స్ ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది.

సెఫ్టీ ఫీచర్లతో బ్యాటరీ

5.0 కిలో వాట్ హవర్ (కెడబ్ల్యూహెచ్) సామర్థ్యమున్న బ్యాటరీతో మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ రానుంది. ఈ బ్యాటరీ 5 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. స్టాండర్డ్, ఫాస్ట్ చార్జింగ్‍లకు సపోర్ట్ చేస్తుంది. ఇళ్లలో ఉండే సాధారణ 5ఎ సాకెట్‍తోనూ దీన్ని చార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ మేనేజ్‍మెంట్ సిస్టమ్, డ్రైవర్ ట్రైన్ యూనిట్, పవర్ కన్జర్వేషన్ మాడ్యూల్స్, లాంట్ ప్రొటెక్షన్ సిస్టమ్‍లను ఈ బైక్ కలిగి ఉండనుంది. దీంతో బ్యాటరీ చాలా భద్రంగా ఉంటుందని మ్యాటర్ సంస్థ తెలిపింది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే ఈ బైక్ 125 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు వస్తుందని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

4-స్పీడ్ గేర్ బాక్స్‌తో..

10.5కెడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్ ఈ ఎలక్ట్రిక్ బైక్‍కు ఉంటుంది. 520ఎన్‌ఎమ్ టార్క్యూను జనరేట్ చేస్తుంది. మూడు రైడింగ్ మోడ్లతో ఈ బైక్ వస్తుంది. సంప్రదాయ 4-స్పీడ్ గేర్ బాక్స్ తో భారత్‌లో లాంచ్ కానున్న ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ కానుంది. 2023 తొలి క్వార్టర్ లో మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ మొదలవుతాయని మ్యాటర్ ఎనర్జీ వెల్లడించింది. 2023 ఏప్రిల్ నాటికి బైక్ డెలివరీలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. నియాన్, బ్లూ, గోల్డ్, బ్లాక్, గోల్డ్ కలర్స్ లో ఈ బైక్ లభించే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..