PAN Card: పాన్‌కార్డు విషయంలో ఇలాంటి తప్పు చేస్తున్నారా? అయితే భారీగా జరిమానాతో పాటు జైలు శిక్ష

రోజురోజుకు నిబంధనలు మారిపోతున్నాయి. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా తెరవాలన్నా, బ్యాంకు లావాదేవీలు జరపాలన్న పాన్‌ కార్డు తప్పనిసరి. పాన్‌కార్డు వల్ల ఆర్థిక విషయాలను..

PAN Card: పాన్‌కార్డు విషయంలో ఇలాంటి తప్పు చేస్తున్నారా? అయితే భారీగా జరిమానాతో పాటు జైలు శిక్ష
Pan Card
Follow us

|

Updated on: Nov 22, 2022 | 8:50 AM

రోజురోజుకు నిబంధనలు మారిపోతున్నాయి. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా తెరవాలన్నా, బ్యాంకు లావాదేవీలు జరపాలన్న పాన్‌ కార్డు తప్పనిసరి. పాన్‌కార్డు వల్ల ఆర్థిక విషయాలను పాన్‌కార్డు ద్వారా గుర్తిస్తుంది ఇన్‌కమ్‌ ట్యాక్‌ డిపార్ట్‌మెంట్‌. ఒక వ్యక్తి ఆర్థిక విషయాలను గుర్తించేందుకు పాన్‌కార్డును తప్పనిసరి చేసింది. అందుకే బ్యాంకు లావాదేవీలకు సంబంధించి విషయాలలో పాన్‌కార్డు తప్పనిసరి చేస్తున్నారు అధికారులు. ముఖ్యమైన డాక్యుమెంట్లలో పాన్‌కార్డు ఒకటి. అయితే ఆర్థిక మోసాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పాన్‌కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక పాన్‌కార్డు విషయంలో కొన్ని తప్పులు చేయడం వల్ల భారీగా జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. మరి ఎలాంటి తప్పులో తెలుసుకోండి.

ఆదాయపు పన్ను శాఖ వివరాల ప్రకారం.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద ఒక పాన్‌కార్డు మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉన్నట్లయితే జరిమానాతో పాటు కేసును ఎదుర్కొవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. కొందరు ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు కలిగి ఉంటారు. ఒకే అడ్రస్‌కు రెండు వేర్వేరు సమయాల్లో పాన్ కార్డులు రావడం, లేదా అడ్రస్ మారిన సమయాల్లో పాన్ కార్డులు రెండు చోట్లకు రావడం వల్ల ఇలా జరుగుతుంటుంది. ఒక వేళ ఒక వ్యక్తి రెండు పాన్‌కార్డులు ఉన్నా పెద్ద మొత్తంలో పెనాల్టీ చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. 1961 ఇన్‌కంటాక్స్ యాక్ట్ సెక్షన్ 272B నిబంధన ప్రకారం.. ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉన్న వ్యక్తులపై జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు అర్హులు. ఇలాంటి తప్పు జరిగినట్లయితే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే పాన్‌కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇలా రెండు పాన్‌కార్డులు ఉండటం వల్ల పెనాల్టీ, జైలు శిక్ష పడడమే కాకుండా బ్యాంకు ఖాతాను కూడా స్తంభింపజేస్తారు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు.

ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు ఉంటే ఏం చేయాలి?

మీ వద్ద రెండు పాన్‌కార్డులు ఉన్నట్లయితే జరిమానా, శిక్ష పడకుండా ఉండేందుకు అవకాశం కల్పిస్తోంది ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌. మీ వద్ద ఉన్న రెండో పాన్‌కార్డును ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులకు సరెండర్‌ చేయాలి. ఒక దరఖాస్తు ఫారాన్ని నింపి పాన్‌కార్డునుఏ సరెండర్‌ చేయవచ్చు. ఇలా చేసినట్లయితే మీకు ఎలాంటి జరిమానా,శిక్ష పడదు.

ఇవి కూడా చదవండి

కార్డును ఎలా సరెండర్‌ చేయాలి?

☛ ముందుగా మీరు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.

☛ అందులో రిక్వెస్ట్ ఫర్ న్యూ పాన్ కార్డ్ అండ్ ఛేంజెస్/కరెక్షన్ ఇన్ పాన్ డేటా అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

☛ ఫారమ్‌ డౌన్‌లోడ్‌ చేసి అందులో వివరాలు నమోదు చేయాలి.

☛ తర్వాత ఎన్‌ఎస్‌డీఎల్‌ కార్యాలయానికి వెళ్లి.. అక్కడ దానిని సబ్మిట్ చేయాలి.

☛ అదే కార్యాలయంలో నింపిన ఫారంతో పాటు.. మీ దగ్గర ఉన్న రెండో పాన్ కార్డును సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో