Adani Group: అబ్బే.. అలాంటిదేమి లేదు.. ఆ విషయాలపై క్లారిటీ ఇచ్చిన ఆదానీ గ్రూప్‌

ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన గౌతమ్‌ ఆదానీ అన్ని వ్యాపార రంగాలలో దూసుకెళ్తున్నారు. అతి తక్కువ కాలంలోనే ఆసియానే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అయితే, అదానీ కొత్త..

Adani Group: అబ్బే.. అలాంటిదేమి లేదు.. ఆ విషయాలపై క్లారిటీ ఇచ్చిన ఆదానీ గ్రూప్‌
Gautam Adani
Follow us

|

Updated on: Nov 20, 2022 | 8:59 AM

ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన గౌతమ్‌ ఆదానీ అన్ని వ్యాపార రంగాలలో దూసుకెళ్తున్నారు. అతి తక్కువ కాలంలోనే ఆసియానే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అయితే, అదానీ కొత్త ప్లాన్‌ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. భారత్‌కే పరిమితం కాకుండా విదేశాల్లోనూ సైతం తన వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పుతున్నట్లు, పోర్ట్స్-టు-పవర్ అదానీ గ్రూప్ సమ్మేళనం కార్యాలయానికి దుబాయ్ లేదా న్యూయార్క్‌ను స్థావరంగా చూస్తున్నారని.. ఇందులో అదానీ కుటుంబం వ్యక్తిగత నిధులను పెట్టుబడిగా పెడుతున్నారని, దీంతో కుటుంబ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ అదానీ తన పెరుగుతున్న సంపదను నిర్వహించడానికి విదేశాల్లో కుటుంబ కార్యాలయాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూప్ ఖండించింది. విదేశాల్లో ఫ్యామిలీ ఆఫీస్‌ను ప్రారంభించే ఆలోచన అదానీకి లేదని కంపెనీ స్పష్టం చేసింది. 58 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదను కలిగి ఉన్న అదానీ న్యూయార్క్ లేదా దుబాయ్ లో కార్యాలయాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ శుక్రవారం నివేదించింది. ఈ మేరకు ఆదానీ గ్రూప్‌ క్లారిటీ ఇచ్చింది.

అదానీ లేదా అతని కుటుంబానికి విదేశాలలో కార్యాలయాలు తెరవడానికి ప్రణాళిక లేదు. దీనిపై ఎలాంటి సంప్రదింపులు జరగలేదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అదానీ వ్యక్తిగత సంపద ఈ ఏడాది ఏకంగా 58 బిలియన్ డాలర్లకు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అదానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరిగా స్థానం పొందారు.

విదేశాల్లో కార్యాలయాలను ప్రారంభించేందుకు కుటుంబ సలహాదారులు, పన్ను సలహాదారులతో అదానీ చర్చలు జరుపుతున్నారు. ఆఫీస్ లొకేషన్ ఇంకా ఖరారు కాలేదు. కన్సల్టెంట్ల సలహా మేరకు ఇది మారే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. అయితే ఈ అంశంపై అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి స్పందించలేదని నివేదిక పేర్కొంది. ఇప్పుడు అదానీ గ్రూప్ గందరగోళానికి తెరతీసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..