Sukanya Samriddhi Yojana: ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన కింద ముగ్గురు కుమార్తెల పేరుపై ఖాతాలు తీయవచ్చు.. ఎలాగంటే..

దేశంలోని మహిళలు, బాలికల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పలు పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం..

Sukanya Samriddhi Yojana: ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన కింద ముగ్గురు కుమార్తెల పేరుపై ఖాతాలు తీయవచ్చు.. ఎలాగంటే..
Sukanya Samriddhi Yojana
Follow us
Subhash Goud

|

Updated on: Nov 20, 2022 | 8:25 AM

దేశంలోని మహిళలు, బాలికల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పలు పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలలో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది మోడీ ప్రభుత్వం. ఈ పథకంలో కుమార్తెల పేరుపై తీసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన కింద ఖాతా తెరిచినప్పుడు మీరు ప్రతి నెలా మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా ఆడపిల్లల భవిష్యత్తు కోసం ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పథకం కింద ప్రతి ఖాతాదారుడు డిపాజిట్ చేసిన మొత్తంపై 7.6 శాతం వడ్డీ రేటు పొందుతారు.

మీరు ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ. 250 నుండి రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఈ పథకం కింద మీరు 10 సంవత్సరాల వరకు ఆడపిల్లల కోసం ఖాతాను తెరవవచ్చు. మీరు ఈ ఖాతాను బ్యాంక్ లేదా ఏదైనా పోస్టాఫీసులో తెరవవచ్చు. ఈ పథకం కింద ఏదైనా పెట్టుబడిదారుడు మొత్తం 14 సంవత్సరాలకు గరిష్ట పెట్టుబడి పరిమితిని పొందుతాడు. దీని తరువాత, బిడ్డకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆమె ఖాతాలో జమ చేసిన మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే సమయంలో మిగిలిన మొత్తాన్ని 21 సంవత్సరాల వయస్సు తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఖాతా (SSY ఖాతా)లో జమ చేసిన డబ్బును ఉపసంహరించుకునే హక్కు కుమార్తెకు ఉందని గుర్తుంచుకోండి. 18 సంవత్సరాలలో ఆమె తన చదువుల కోసం, 21 సంవత్సరాల తర్వాత తన వివాహ ఖర్చుల కోసం ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

ముగ్గురిపై ఖాతా తీయడం ఎలా?

సుకన్య సమృద్ధి యోజన కింద తల్లిదండ్రులు తమ ఇద్దరు కుమార్తెలకు మాత్రమే ఖాతాలను తెరవడానికి అనుమతి పొందుతారు. అటువంటి పరిస్థితిలో మూడవ ఆడపిల్ల సుకన్య సమృద్ధి ఖాతా తెరవడానికి అనుమతి ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతుంది. ఒక వ్యక్తికి మొదటి బిడ్డలో ఒక కుమార్తె, రెండవ సారి కవలలు జన్మించినట్లయితే. అటువంటి పరిస్థితిలో ముగ్గురు బాలికలందరికీ సుకన్య సమృద్ధి ఖాతా తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. తల్లిదండ్రులు ముగ్గురు బాలికల పేరు మీద సుకన్య సమృద్ధి ఖాతాను తెరవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అయితే ఈ పథకం కింద గుర్తించదగ్గ విషయం ఏమిటంటే, ముగ్గురు కుమార్తెల ఖాతాకు ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనం ఇవ్వబడింది. ఈ పథకం కింద 7.6 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ఈ పథకంలో ఆదాయం ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ -10 ప్రకారం పూర్తిగా పన్ను ఆదా పొందవచ్చు. అలాగే స్కీమ్‌లో చేసిన పెట్టుబడి చట్టంలోని సెక్షన్ 80-సి కింద మినహాయింపుకు అర్హత పొందుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..