Credit Card UPI: క్రెడిట్‌ కార్డును యూపీఐకి ఎలా లింక్‌ చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు..

ఆన్‌లైన్ చెల్లింపులను మరింత ప్రోత్సహించడానికి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ సదుపాయం వినియోగదారులు రూపే క్రెడిట్ కార్డ్‌ని BHIM UPI యాప్‌తో లింక్ చేసుకోవచ్చు.

Credit Card UPI: క్రెడిట్‌ కార్డును యూపీఐకి ఎలా లింక్‌ చేసుకోవాలంటే.. పూర్తి వివరాలు..
Credit Card Link To Upi
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 20, 2022 | 9:26 PM

ఆన్‌లైన్ చెల్లింపులను మరింత ప్రోత్సహించడానికి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ సదుపాయం వినియోగదారులు రూపే క్రెడిట్ కార్డ్‌ని BHIM UPI యాప్‌తో లింక్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్‌ని UPIతో లింక్ చేసిన తర్వాత, ఇప్పుడు కస్టమర్ కార్డ్‌ని స్వైప్ చేయకుండానే ఉపయోగించవచ్చు. UPIకి కార్డ్ లింక్ చేసుకుంటే క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేయడం ద్వారా డబ్బులు చెల్లించవచ్చు.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, క్రెడిట్ కార్డ్ ఉపయోగం 30 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని, అయితే భారత్‌లో వ్యాపారం 6 శాతం తగ్గిందని ఫిన్‌టెక్ కంపెనీ మైండ్‌గేట్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ చెప్పారు. ఈ కొత్త విధానం క్రెడిట్ కార్డు వినియోగం పెంచడంలో ఉపయోగపడుతుంది ఆయన చెప్పారు. ఇక ఈ రూపే క్రెడిట్ కార్డులను ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే అందిస్తారు. సెప్టెంబర్ 20, 2022న NPCI జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ కస్టమర్‌లు ముందుగా BHIM యాప్‌లో రూపే క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు.

యూపీఐతో రూపే క్రెడిట్‌ కార్డ్‌ని ఎలా లింక్‌ చేయాలంటే..

* ఇందుకోసం ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో BHIM యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

* అనంతరం ‘యాడ్‌ క్రెడిట్‌ కార్డ్‌’ను సెలక్ట్‌ చేసుకొని, రూపే క్రెడిట్‌ కార్డును జారీ చేసిన బ్యాంకును ఎంచుకోవాలి.

* అనంతరం రూపే క్రెడిట్ కార్డ్‌లోని చివరి ఆరు అంటకెలు, చెల్లుబాటు తేదీని ఎంటర్‌ చేయాలి.

* వెంటనే ఫోన్‌కు ఓటీపీ వెళుతుంది.

* చివరగా యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..