FD Interest Rates: బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలనుకుంటున్నారా? 8.5 – 9% ఎఫ్‌డీ వడ్డీ రేట్లు అందించే 5 బ్యాంకులు ఇవే..
చాలా మంది తమ సంపాదనను దాచుకోవడానికి బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఇందుకోసం ఏ బ్యాంక్ అయితే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తుందో..
చాలా మంది తమ సంపాదనను దాచుకోవడానికి బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఇందుకోసం ఏ బ్యాంక్ అయితే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తుందో అందులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. అయితే, బ్యాంకులు సాధారణ కస్టమర్ల కంటే.. సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేటును ఇస్తాయి. ఇటీవల ఆర్‌బీఐ వడ్డీ రేట్లను సవరించిన నేపథ్యంలో ప్రధాన బ్యాంకులన్నీ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచాయి. ఈ ప్రధాన బ్యాంకుల బాటలోనే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా పయనిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలపై 8.5 – 9 శాతం వడ్డీ రేట్లను అందించే 5 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వివరాలు, అవి అందించే వడ్డీ రేట్ల వివరాలు ఇవాళ మనం తెలుసుకుందాం..
1. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..
ఈ వారం యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. సీనియర్ సిటిజన్ పెట్టుబడిదారులకు 9% వడ్డీని అందిస్తోంది. ఈ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లకు 181 నుంచి 501 రోజుల పాటు పెట్టుబడి పెట్టిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9% వడ్డీ రేటును అందిస్తుంది. మిగతా వివరాలు బ్యాంకు అధికారిక ఫోటోలో చూడొచ్చు.
2. ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..
7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు FD లపై సీనియర్ సిటిజన్‌లకు ఈ బ్యాంక్ 4.50% నుండి 8.50% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, సవరించిన FD వడ్డీ రేట్లు నవంబర్ 1, 2022 నుండి అమలులోకి వచ్చాయి. 999 రోజులకు 8.00 శాతం ప్రత్యేక FD రేటు 30 నవంబర్ 2022 వరకు అందుబాటులో ఉంటుంది. మిగతా వివరాలు బ్యాంకు అధికారిక ఫోటోలో చూడొచ్చు.
3. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కస్టమర్‌లకు 0.75% అధిక వడ్డీ రేటును అందిస్తుంది. ఈ రేట్లు నవంబర్ 5, 2022 నుండి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ అందించే అత్యధిక రేటు 80 వారాలకు (560 రోజులు) 8.75%. మిగతా వివరాలు బ్యాంకు అధికారిక ఫోటోలో చూడొచ్చు.
4. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు తమ సీనియర్ సిటిజన్ కస్టమర్‌లకు 0.50% అధిక వడ్డీ రేటును అందిస్తాయి. ఈ రేట్లు నవంబర్ 9, 2022 నుండి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ అందించే అత్యధిక రేటు 1000 రోజుల కాలవ్యవధికి 8.50%. మిగతా వివరాలు బ్యాంకు అధికారిక ఫోటోలో చూడొచ్చు.
5. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కస్టమర్‌లకు 0.75% అధిక వడ్డీ రేటును అందిస్తుంది. ఈ రేట్లు అక్టోబర్ 17, 2022 నుండి అమలులోకి వచ్చాయి. సీనియర్ సిటిజన్‌లకు 700 రోజుల కాలవ్యవధికి బ్యాంక్ అందించే అత్యధిక రేటు 8.50%. ఈ రేట్లు తాజా ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, ఇప్పటికే ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల పునరుద్ధరణకు కూడా వర్తిస్తాయి. మిగతా వివరాలు బ్యాంకు అధికారిక ఫోటోలో చూడొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..