Zomato Layoffs: మాంద్యం ముప్పు తప్పదా.? ఉద్యోగులను తొలగిస్తున్న జాబితాలో జొమాటో..

ప్రపంచం ఆర్థిక మాంద్యం ముంగిట్లో ఉందన్న వాదనలకు ఉద్యోగుల తొలగింపు బలం చేకూరుస్తోంది. ప్రఖ్యాత ఐటీ కంపెనీలు ఉద్యోగులకు పింక్‌ స్లిప్స్‌ ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. అమెజాన్‌, యాపిల్‌, ట్విట్టర్‌, మెటా వంటి..

Zomato Layoffs: మాంద్యం ముప్పు తప్పదా.? ఉద్యోగులను తొలగిస్తున్న జాబితాలో జొమాటో..
Zomato Layoffs
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 20, 2022 | 4:55 PM

ప్రపంచం ఆర్థిక మాంద్యం ముంగిట్లో ఉందన్న వాదనలకు ఉద్యోగుల తొలగింపు బలం చేకూరుస్తోంది. ప్రఖ్యాత ఐటీ కంపెనీలు ఉద్యోగులకు పింక్‌ స్లిప్స్‌ ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. అమెజాన్‌, యాపిల్‌, ట్విట్టర్‌, మెటా వంటి దిగ్గజ కంపెనీలే ఉద్యోగులను తొలగించడంతో  ఆర్థిక మాంద్యం నేపథ్యంలోనే ఇదంతా జరుగుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తన మొత్తం ఉద్యోగుల్లో 3 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే తొలగింపు ప్రక్రియను మొదలు పెట్టిన జొమాటో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించిందేందుకు సిద్ధమైంది. మార్కెటింగ్, టెక్‌ కేటగిరీల్లో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 3 నుంచి 4 శాతం మంది ఉద్యోగులను ఇప్పటికే ఇంటికి పంపించినట్లు సమాచారం. ఈ తొలగింపు ప్రక్రియ రానున్న రోజుల్లోనూ కొనసాగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులను తగ్గించడానికే ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఆర్థిక కష్టాల్లో ఉన్న జొమాటో ఇటీవల తన నష్టాలను తగ్గించుకున్న విషయం తెలిసిందే. ఈ త్రైమాసికంలో ఈ కంపెనీ నష్టాలు రూ. 251 కోట్లు తగ్గాయి. నష్టాలు తగ్గినా ఉద్యోగులను ఎందుకు తొలగించాల్సిన అవసరం వచ్చిందన్న దానిపై స్పష్టతలేదు. అయితే వచ్చే ఏడాది మాంద్యం ప్రభావం ప్రపంచంపై కచ్చితంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలోనే జొమాటా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..