Recession: ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం.. భారత్‌ ఐటీ రంగంపై ప్రభావం ఎంత, ఉద్యోగుల పరిస్థితి ఏంటీ.?

మరో భారీ ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. ప్రపంచం మునుపెన్నడూ చూడని అతిపెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చేస్తోందని ఇప్పటికే ప్రపంచం కోడై కూస్తోంది. అమెరికా మొదలు బ్రిటన్‌ వరకు మాంద్యం చాయలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీగా పెరిగిన ద్రవ్యోల్బణంతో..

Recession: ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం.. భారత్‌ ఐటీ రంగంపై ప్రభావం ఎంత, ఉద్యోగుల పరిస్థితి ఏంటీ.?
recession effect on it industry
Follow us

|

Updated on: Oct 22, 2022 | 6:25 AM

మరో భారీ ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. ప్రపంచం మునుపెన్నడూ చూడని అతిపెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చేస్తోందని ఇప్పటికే ప్రపంచం కోడై కూస్తోంది. అమెరికా మొదలు బ్రిటన్‌ వరకు మాంద్యం చాయలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీగా పెరిగిన ద్రవ్యోల్బణంతో ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక ‘అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుంది’ అనే సామెత ఉండనే ఉంది. ఇక ఆర్థిక మాంద్యంతో మొదటగా ప్రభావితమయ్యే రంగం ఏదైనా ఉందా అంటే అది ఐటీ రంగమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మాంద్యం ప్రభావం భారత్‌పై ఎలా ఉంది.? ఇక్కడి ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఏంటన్న దానిపై విశ్లేషణాత్మక కథనం మీకోసం..

అంతర్జాతీయంగా ఏర్పడ్డ గడ్డు పరిస్థితుల దృష్ట్యా భారత్‌లో ఐటీ కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు, ఉద్యోగ నియామకాలను తగ్గించాయి. భారత్‌లో టాప్‌ 3 ఐటీ కంపెనీలు జూన్ త్రై మాసికంతో పోల్చితే సెప్టెంబర్‌తో ముగిసిన త్రై మాసికంలో 60 శాతం నియామకాలనుతగ్గించాయి. ఓ రిపోర్ట్‌ ప్రకారం.. టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ 50 వేల మందిని జూన్‌ త్రైమాసికంలో ఉద్యోగాలలోకి తీసుకున్నాయి. కానీ సెప్టెంబర్‌ త్రై మాసికంలో కేవలం 20 వేల మందిని మాత్రమే కొత్తగా రిక్రూట్ చేసుకున్నాయి. సెప్టెంబర్‌ త్రై మాసికంలో విప్రో నియామకాలను 96 శాతం తగ్గించేసింది. ఇంటర్నేషనల్ డేటా సెంటర్‌ రిపోర్ట్ ప్రకారం.. హార్డ్ వేర్‌, సాప్ట్‌ వేర్‌, ఐటీ సర్వీస్‌లపై 2022లో ఐటీ కంపెనీల ఖర్చు గత ఏడాదితో పోలిస్తే తక్కువ ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది ఐటీ ఖర్చు పెరుగుదల 13.8 శాతం ఉంటుందని ఇంటర్నేషనల్ డేటా సెంటర్‌ అంచనా వేయగా గత యేడాది ఐటీ ఖర్చు 25 శాతం కంటే అధికం కావడం గమనార్హం.

అంతర్జాతీయంగా కంప్యూటర్ల అమ్మాకల్లో తగ్గుదల ఐటీ రంగం ఆర్ధిక మాంద్యం కోరల్లో చిక్కుకున్న సంకేతాలను ఇస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ ఊహించే భారత ఐటీ కంపెనీలు తమ ఖర్చులతో పాటు, కొత్త ఉద్యోగుల నియామకాలను తగ్గించాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ రంగంలో మాంద్యం ప్రభావాన్ని మార్కెట్‌ ముందుగానే అంచనా వేసింది. ఈ ఏడాది ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, హెచ్‌ సిఎల్‌ ఐటీ కంపెనీల షేర్ల ధరలు తగ్గాయి. వివిధ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ సగానికి తగ్గగా, మరికొన్ని కంపెనీలు 1/4 వ వంతుకి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా మాంద్యం ప్రభావాన్ని చూశాయి. దీంతో తమ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఫేస్‌ బుక్‌, వాట్స్‌ యాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృ సంస్థ మెటా ఉద్యోగులను లే ఆఫ్‌ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ మాతృ సంస్థ కొత్త ఉద్యోగ నియామకాలను తగ్గించింది. ఉద్యోగులను తగ్గించుకోవడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవాలనే ఆలోచనలో ఐటీ కంపెనీలున్నాయి. ఈ కంపెనీలన్నింటిలో భారత ఐటీ ప్రొఫెషనల్స్‌ పనిచేస్తుండటంతో యాజమాన్యాలు తీసుకునే చర్యలతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..