UK Politics: బ్రిటన్ తర్వాతి ప్రధాని ఎవరు.? రిషి సునాక్‌కు ఈసారి అవకాశం దక్కేనా..?
లిజ్‌ట్రస్ రాజీనామా తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. బ్రిటన్‌లో 2016 నుంచి ఇప్పటికి వరకూ నలుగు ప్రధానులు మారారు.. డెవిడ్ కామరూన్, థెరిస్సామే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ అనూహ్యంగా ప్రధానమంత్రి పదవులకు రాజీనామా..

లిజ్‌ట్రస్ రాజీనామా తర్వాత యునైటెడ్ కింగ్‌డమ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. బ్రిటన్‌లో 2016 నుంచి ఇప్పటికి వరకూ నలుగు ప్రధానులు మారారు.. డెవిడ్ కామరూన్, థెరిస్సామే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ అనూహ్యంగా ప్రధానమంత్రి పదవులకు రాజీనామా చేయడంతో కన్జర్వేటివ్ పార్టీలో రాజకీయ నాయకత్వ గందగోళం ఏర్పడింది. బ్రిటన్ తదుపరి ప్రధానిగా భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే బోరిస్ జాన్సన్ మరోసారి ప్రధాని పదవి ఆశించే అవకాశాలున్నాయి.. సీనియర్ లీడర్స్ పెనీ మోర్డౌంట్, బెన్ వాలెస్, జెరేమీ హంట్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే బెన్ వాలెస్ పోటీ నుంచి తప్పుకొని బోరిస్‌కే మద్దతు ఇస్తున్నారని తెలుస్తోంది.
రిషి సునాక్‌కు ఇప్పటికే 35 మంది ఎంపీలు మద్దతు పలికారు. బోరిస్ జాన్సన్‌కు 19 మంది, పెన్నీ మోర్డాంట్‌కి 11 మంది ఎంపీలు మద్దతు ఉంది. అయితే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కి 375 మంది ఎంపీల్లో 100 మంది కూడా మద్దతు కూడా లేదని తెలుస్తోంది. దీంతో ఇక రిషి సునాక్‌కు అవకాశం ఎక్కువ అని ప్రచారం జరుగుతోంది. సునాక్ ప్రధాని పదవి కోసం లిజ్‌తో చివరిదాకా పోటీ పడ్డారు. అయితే తన పదవి పోవడానికి కారకుడైన సునాక్‌ను బోరిస్ వర్గం అడ్డుకుంది.
తాజా పరిణామాలను గమనిస్తుంటే ఆంగ్లేయ మనస్థత్వం రిషిని ఎంత వరకూ ప్రధానిగా అంగీకరిస్తుందనే అనుమానాలున్నాయి. ప్రస్తుత బ్రిటన్ పార్లమెంట్ గడువు 2025 వరకూ ఉంది. అప్పటి వరకూ సభలో మెజార్టీ ఉన్న కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థే ప్రధానిగా ఉంటారు. బ్రిటన్‌లో ఈ రాజకీయ సంక్షోభానికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి.



మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
