AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఎన్నికల సంఘం బిగ్ షాక్.. ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ..

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‭కు బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ బహుమతలును చట్టవిరద్ధంగా విక్రయించారనే ఆరోపణలపై ఆయనపై ఎన్నికల సంఘం అనర్వత వేటు వేసింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా..

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఎన్నికల సంఘం బిగ్ షాక్.. ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ..
Imran Khan
Amarnadh Daneti
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 21, 2022 | 5:17 PM

Share

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‭కు బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ బహుమతలును చట్టవిరద్ధంగా విక్రయించారనే ఆరోపణలపై ఆయనపై ఎన్నికల సంఘం అనర్వత వేటు వేసింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇతర దేశాధినేతలు, విదేశీ ప్రముఖుల నుంచి అందుకున్న ప్రభుత్వ బహుమతులను చట్టవిరుద్ధంగా విక్రయించారనే ఆరోపణలపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. దీంతో ఆయన తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. ఇతర దేశాధినేతలు, విదేశీ ప్రముఖుల నుంచి అందుకున్న ప్రభుత్వ బహుమతుల విక్రయానికి సంబంధించిన వివరాల్ని ప్రకటించడంలో ఇమ్రాన్ ఖాన్ విఫలం కావడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇమ్రాన్ ఖాన్‭కు సంబంధించిన ఈ టోషఖానా కేసుపై కొంత కాలంగా విచారణ చేపట్టిన పాకిస్తాన్ ఎన్నికల సంఘం శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. స్థానిక రాజ్యాంగంలోని ఆర్టికల్ 63(1) ప్రకారం.. ఐదేళ్ల పాటు ప్రావిన్షియల్ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు ఇమ్రాన్ ఖాన్ అనర్హుడని తెలిపింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఖాళీ చేసే స్థానంలో ఎన్నిక నిర్వహణకు కూడా ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ లాయర్లలో ఒకరైన గోహర్ ఖాన్ మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ అవినీతికి పాల్పడినట్లు రుజువైందని, ఐదేళ్ల పాటు ఆయనపై అనర్హత వేటు వేశారని.. అయితే ఎన్నికల సంఘం కోర్టు కాదని, ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని తాము ఇస్లామాబాద్ హైకోర్టులో సవాల్ చేస్తాం అని తెలిపారు.

ఎన్నికల సంఘం తన నిర్ణయం వెల్లడించిన వెంటనే పీటీఐ ఉపాధ్యక్షుడు ఫవద్ చౌదరి ఘాటుగా స్పందించారు. హక్కులను కాపాడుకోవడం కోసం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తిరస్కరించాలని ప్రజలను కోరారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు వేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. దర్యాప్తునకు ఖాన్ సహకరిస్తున్నారని తెలిపారు. కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే తోషాఖానా బహుమతులు, వాటి అమ్మకాల వల్ల వచ్చిన సొమ్ము వివరాలను ఇమ్రాన్ ఖాన్ తెలియజేయడం లేదని ప్రస్తుత ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి

నేషనల్ అసెంబ్లీ స్పీకర్ రజా పర్వేజ్ ఈ కేసును చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రజాకు నివేదించారు. దీంతో ఎన్నికల కమిషన్ నోటీసులపై ఇమ్రాన్ ఖాన్ సెప్టెంబరులో స్పందించారు. తాను ప్రధాన మంత్రిగా పని చేసిన కాలంలో విదేశీ నేతల నుంచి స్వీకరించిన బహుమతుల్లో నాలుగింటిని విక్రయించినట్లు అంగీకరించారు. వీటిని 21.56 మిలియన్ పాకిస్థానీ రూపాయలను చెల్లించి ఖజానా నుంచి తీసుకున్నానని, వీటిని అమ్మగా 58 మిలియన్ పాకిస్థానీ రూపాయలు వచ్చిందని తెలిపారు. ఈ విక్రయాల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇమ్రాన్ ఖాన్ పై అనర్హత వేస్తూ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..