PM Kisan New Rule: పీఎం కిసాన్‌లో కొత్త రూల్స్.. ఈ రైతులు తీసుకున్న వాయిదాలు తిరిగి ఇవాల్సిందే.. లేకపోతే సమస్యల్లో చిక్కుకున్నట్లే..
కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలలో పీఎం కిసాన్ యోజన స్కీమ్ ఒకటి. రైతులకు ఏడాదికి రూ.6000 చొప్పున అందిస్తోంది. ఈ డబ్బులు..
కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలలో పీఎం కిసాన్ యోజన స్కీమ్ ఒకటి. రైతులకు ఏడాదికి రూ.6000 చొప్పున అందిస్తోంది. ఈ డబ్బులు రూ.2000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకాన్ని అర్హులైన వారే కాకుండా అనర్హులు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకంలో డబ్బులు పొందిన అనర్హుల నుంచి రికవరీ చేసే పనిలో ఉంది. మీరు అనర్హులుగా ఉండి ఈ పీఎం కిసాన్ పథకాన్ని పొందినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. వారి నుంచి డబ్బులను రికవరీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మార్చింది. ఈ పథకంలో ఇప్పటి వరకు 8 మార్పులను చేసింది కేంద్రం.
మీరు కూడా ఈ పథకం కింద మీ డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేయకుంటే వెంటనే పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈ పథకంలో జరుగుతున్న మోసాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం కొత్త నియమం ప్రకారం.. మీ పత్రాలు నవీకరించబడకపోతే మీరు చెల్లింపు తీసుకునేవారి నకిలీ జాబితాలో తప్పుగా చేర్చబడతారు. మీరు ఇప్పటివరకు అందుకున్న అన్ని వాయిదాలను తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఇప్పటికే అనర్హుల జాబితాను సిద్ధం చేసింది కేంద్రం. అనర్హులుగా ఉండి డబ్బులు పొందుతున్న వారు అధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు.
పీఎం కిసాన్ యోజనలో ఇప్పటివరకు 8 మార్పులు:
ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటి వరకు 11వ విడత సొమ్ము రైతుల ఖాతాలో చేరింది. ఇప్పుడు 12వ విడత కూడా కొందరి ఖాతాల్లో జమ కాగా, మరికొందరికి ఇంకా అందలేదు. ఈనెలలో వారి అకౌంట్లో జమ చేసే అవకాశం ఉంది. ఈ పథకంలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం నిబంధనలను మార్చింది. తద్వారా అలాంటి వారిని గుర్తించవచ్చు. ఇటీవల లబ్ధిదారులు ఇ-కెవైసి చేయాల్సిన అవసరం ఏర్పడింది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం నకిలీ రైతులపై కఠిన చర్యలు ప్రారంభించి నోటీసులు కూడా పంపుతోంది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు కూడా దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. మరోవైపు కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఈ పథకం పొందుతున్నవారున్నారు. అలాంటి వారిపై కూడా దృష్టి సారిస్తోంది. కేంద్రం. ఒకే కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నట్లయితే అందుకు అనర్హులు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం లభిస్తుందని గుర్తించుకోవాలి. ఇక అనర్హులు ఈ పథకం ప్రయోజనం పొందినట్లయితే వెంటనే ఆ డబ్బులను వాపస్ చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డబ్బులను రిటన్ చేయవచ్చు. మీరే స్వచ్చంధంగా డబ్బులు వాపస్ చేసినట్లయితే మీపై ఎలాంటి చర్యలు ఉండవు. లేకపోతే చర్యలతో పాటు డబ్బులు వాపసు చేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..