Mutual Fund: రూ 10 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో 29 ఏళ్లలో చేతికి 13 కోట్లు..!

అధిక రాబడి పొందేందుకు రకరకాల మార్గాలున్నాయి. నెలనెలా ఇన్వెస్ట్‌మెంట్‌తో మెచ్యూరిటీ కాలానికి అధిక మొత్తంలో రిటర్న్‌ పొందే అవకాశం ఉంటుంది. చాలా మంది..

Mutual Fund: రూ 10 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో 29 ఏళ్లలో చేతికి 13 కోట్లు..!
Mutual Fund
Follow us
Subhash Goud

|

Updated on: Nov 21, 2022 | 1:54 PM

అధిక రాబడి పొందేందుకు రకరకాల మార్గాలున్నాయి. మ్యూచువల్ ఫండ్ లలో పెట్టుబడి పెట్టడం వల్ల అధిక రాబడిపొందవచ్చు. నెలనెలా ఇన్వెస్ట్‌మెంట్‌తో మెచ్యూరిటీ కాలానికి అధిక మొత్తంలో రిటర్న్‌ పొందే అవకాశం ఉంటుంది. చాలా మంది ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్స్‌, ఇతర ఫండ్స్‌లలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలంలో అధిక సంపదను సృష్టించుకుంటున్నారు. ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ఫండ్ అని పిలువబడే ఓపెన్‌-ఎండ్‌ ఈక్విటీ ఫండ్‌ ప్రధానంగా మిడ్ క్యాప్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. ఈ ఫండ్ 65 శాతం మిడ్ క్యాప్‌ స్టాక్స్‌కు ఎక్స్‌ పోజర్‌ ఉండటంతో దీని మిడ్ క్యాప్‌ ఫండ్‌గా పరిగణిస్తారు. డిసెంబర్‌ 1,1993లో ప్రారంభమైన ఈ ఫండ్ 29 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ ఫండ్ గత 20 ఏళ్లుగా ప్రతి యేటా డివిడెండ్‌ ప్రకటిస్తోంది. అయితే దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవాలనుకునే ఇన్వెస్టర్లు రిటైర్మెంట్ సేవింగ్స్‌, పిల్లల చదువుల కోసం, పెళ్లి కోసం ఈ ఫండ్‌లో కనీసం 5 ఏళ్లు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ సిప్‌ ప్రారంభం నుండి లాంగ్ రన్‌ పర్ఫార్మెన్స్‌ గమనిస్తే ఏటా 19.05 శాతం సీఏజీఆర్‌ ఇస్తోంది. ప్రతి నెలా కొంత మొత్తాన్ని బ్యాంకులో దాచుకున్నట్లే, ఒక స్థిరమైన మొత్తాన్ని క్రమ పద్ధతిలో పెట్టుబడిగా పెట్టుకునే విధానాన్ని సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (సిప్‌) అంటున్నారు. ఇది మంచి రాబడిని ఇస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు.

ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ఐపీ పర్ఫార్మెన్స్‌ చూస్తే అక్టోబర్‌ 31, 2022 నాటికి ప్రతీ నెలా రూ 10000 సిప్‌ చేస్తే ఈ ఫండ్‌ ద్వారా 13.36 శాతం రాబడితో గత సంవత్సరానికి రూ 1.2 లక్షల నుండి 1.28 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి నెలా రూ 10000 సిప్‌ (ఎస్‌ఐపీ)తో గత 3 ఏళ్లలో ఈ ఫండ్ ఏటా ఇచ్చిన 21.39 శాతం రిటర్న్‌ తో మీ ఇన్వెస్ట్‌మెంట్‌ రూ 3.6 లక్షల నుండి రూ 4.92 లక్షలు వచ్చేవి. గత 5 ఏళ్ల కాలంలో ఈ ఫండ్ ఇచ్చిన 15.56 శాతం రిటర్న్‌ తో ప్రతి నెలా రూ 10000 సిప్‌తోతో మీ పెట్టుబడి రూ 6 లక్షల నుండి రూ 8.5 లక్షల అయ్యేది.

గత ఏడేళ్లలో ఈ ఫండ్ ఇచ్చిన 13.82 శాతం రిటర్న్‌ తో ప్రతి నెలా రూ 10000 సిప్‌తో మీ పెట్టుబడి రూ 8.4 లక్షల నుండి రూ.13.74లక్షలు అవుతుంది. గత పది సంవత్సరాలలో ఇచ్చిన 15.59 శాతం రిటర్న్‌ తో ప్రతి నెలా రూ 10000 సిప్‌తో మీ పెట్టుబడి రూ.12 లక్షల నుండి రూ.27.15 లక్షల వరకు చేరుకుంటుంది. అలాగే గత15 ఏళ్లలో 16.57శాతం రిటర్న్‌ తో ప్రతి నెలా రూ 10000 సిప్‌తో మీ పెట్టుబడి రూ.18 లక్షల నుండి రూ.70.70 లక్షల అవుతుంది. ఈ ఫండ్ ప్రారంభం నుండి ఏటా 20.6 శాతం రిటర్న్స్‌ ఇస్తోంది. ఈ లెక్క ప్రకారం ప్రతి నెలా రూ 10000 సిప్‌తో నేటికి మీరు చేసిన మొత్తం రూ 34.7 లక్షలు పెట్టుబడి నేటికి రూ 13 కోట్లు అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ఫండ్ వివరాలు:

ఫిబ్రవరి7, 2022 నుండి ఈ ఫండ్‌ని ఆర్‌. జానకిరామన్‌ అండ్‌ అఖిల్ కల్లూరి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. అయితే విదేశీ సెక్యూరిటీలలో పెట్టుబడులు చేయడానికి సందీప్‌ మానంని ప్రత్యేకంగా నియమించారు. ఫ్రాంక్లిన్‌ ఇండియా ప్రైమా ఫండ్ గ్రోత్‌ రూ 7752.89 కోట్ల విలువ గల ఆస్తులను సెప్టెంబర్‌ 30,2022 నాటికి ప్రతి నెలా యాజమాన్యం సగటున రూ 7598.57 కోట్ల ఆస్తులను, నవంబర్18,2022 నాటికి ఈ ఫండ్ నెట్ అస్సెట్ వ్యాల్యూ రూ. 1515.41 కోట్లు యాజమాన్యం కలిగి ఉంది.

నిప్టీ మిడ్ క్యాప్‌ 150 ఇండెక్స్‌లో ఈ ఫండ్ ఉంది. ఈ ఫండ్ పోర్ట్‌ ఫోలియో టర్నోవర్ నిష్పత్తి 31.69 శాతం, స్టాండర్డ్ డీవియేషన్‌ 7.04 శాతం, బీటా నిష్పత్తి 0.90 శాతం షార్ప్‌ రేషియో 0.46 శాతం ఉంది. ఈ ఫండ్ రెగ్యులర్ ఆప్షన్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో 1.88 శాతం, డైరెక్ట్ ఆప్షన్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో 1.09 శాతం ఉంది. ఈ ఫండ్ టాప్‌ 5 రంగాలైన బ్యాంకులు, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌, రిటైలింగ్, ఫైనాన్స్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ సర్వీసులలో పెట్టుబడులు కలిగి ఉంది. ఫెడరల్ బ్యాంక్‌ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్‌ లిమిటెడ్, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్సూమర్‌ ఎలెక్ట్రికల్స్‌ లిమిటెడ్, దీపక్‌ నైట్రైట్‌ లిమిటెడ్, మ్యాక్స్‌ హెల్త్‌ కేర్‌ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ లాంటి టాప్‌ ఫండ్స్‌లో ఈ నిధులు హోల్డింగ్‌లో ఉన్నాయి. ఈ ఫండ్ 96.93 శాతం ఎక్స్‌పోజర్‌ ఈక్విటీ సెక్యూరిలలో ఉండగా, అందులో 16.4 శాతం లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌, 68.14 శాతం మిడ్ క్యాప్‌ స్టాక్స్‌, 12.39 శాతం స్మాల్ క్యాప్‌ స్టాక్స్‌లో ఉంది. ఇలా మ్యూచువల్‌ ఫండ్‌లలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మంచి రాబడిని పొందవచ్చుంటున్నారు ఆర్థిక నిపుణులు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..