WhatsApp Feature: యూజర్ల భద్రత కోసం వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇక ప్రతిసారి పాస్‌వర్డ్ తప్పనిసరి
ప్రస్తుతం వాట్సాప్ వాడనివారుండరు. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు..
ప్రస్తుతం వాట్సాప్ వాడనివారుండరు. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. యూజర్లను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ సంస్థ కొత్తకొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. వాట్సాప్ అనేది ఇప్పుడు తప్పనిసరిగ్గా మారిపోయింది. ఇక వాట్సాప్ మరో కొత్త ప్రైవసీ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఇది డెస్క్‌టాప్ యూజర్లకు ఉపయోగపడనుంది. స్క్రీన్ లాక్ పేరుతో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌తో డెస్క్‌టాప్‌లో యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారీ పాస్‌వర్డ్ నమోదు చేయమని అడుగుతుంది. దీని వల్ల యూజర్ చాట్ సంభాషణలకు అదనపు భద్రత ఉంటుందని వాట్సాప్ సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల వాట్సాప్ యూజర్ చాట్ సంభాషణలకు మరింత భద్రత ఉంటుందని వాట్సాప్ సంస్థ చెబుతోంది.
ఇప్పటి వరకు వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షణ్ యాప్‌కు ఎలాంటి పాస్‌వర్డ్ భద్రత లేదనే విషయం తెలిసిందే. ఒక్కసారి డెస్క్‌టాప్‌పై లాగిన్ అయితే తర్వాత లాగిన్ కావాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల ఇతర వ్యక్తులు డెస్క్‌టాప్‌లను ఉపయోగించే సమయంలో వాట్సాప్ యాప్‌ను యాక్సెస్ చేయవచ్చు. దీంతో వ్యక్తిగత సమాచారం భద్రతకు భంగం కలుగుతుంది. ఇలా యూజర్ల వాట్సాప్ చాట్‌కు సెక్యూరిటీ ఉండాలనే ఉద్దేశంతో స్క్రీన్‌లాక్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్ డెస్క్‌టాప్‌పై వాట్సాప్ ఓపెన్ చేసిన ప్రతీసారి పాస్‌వర్డ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఒకవేల యూజర్ తన పాస్‌వర్డ్‌ను మర్చిపోయినట్లయితే యాప్ నుంచి లాగౌట్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ సాయంతో లాగిన్ కావచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి