- Telugu News Photo Gallery Technology photos Vivo launching new smart phone Vivo X90 series have a look on features and price Telugu Tech News
Vivo X90: వివో నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. స్టన్నింగ్ లుక్, అదిరిపోయే ఫీచర్లు..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. వివో ఎక్స్ 90 సిరీస్‌లో భాగంగా మూడు ఫోన్‌లను లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి. లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Nov 20, 2022 | 8:36 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. వివో ఎక్స్90 పేరుతో ఈ ఫోన్‌ను తీసురానున్నారు. వినూత్నమైన డిజైన్‌తో ఈ ఫోన్‌ను రూపొందించారు.

వివో కెమెరా ఫోకస్డ్ ఎక్స్80 సిరీస్ కొనసాగింపుగా ఎక్స్90 సిరీస్‌ను తీసుకొచ్చారు. ఈ సీరిస్‌లో భాగంగా వివో ఎక్స్90, వివో ఎక్స్90ప్రొ, వివో ఎక్స్90ప్రొ , వివోఎక్స్90 ప్రొ ప్లస్ మూడు ఫోన్‌లను తీసుకురానున్నారు.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు డైమెన్సిటీ 9200 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి.

ఆండ్రాయిడ్ 13 ఆరిజిన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేసే వివో ఎక్స్90 ప్రొలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు.

బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 4700ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 50డబ్ల్యూ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇవ్వనున్నారు. ధర విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.




