AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airplane Tyres: విమానం టైర్ల తయారీలో ఎలాంటి మెటీరియల్‌ వాడుతారు.. ఆసక్తికర విషయాలు!

ఏదైనా వాహనానికి ముఖ్యమైనవి టైర్లు. ఇవి బాగుంటేనే వాహనం ముందుకు కదులుతుంది. వాటిపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇక వాహనం టైర్ల గురించి..

Airplane Tyres: విమానం టైర్ల తయారీలో ఎలాంటి మెటీరియల్‌ వాడుతారు.. ఆసక్తికర విషయాలు!
Airplane Tires
Subhash Goud
|

Updated on: Nov 19, 2022 | 9:35 AM

Share

ఏదైనా వాహనానికి ముఖ్యమైనవి టైర్లు. ఇవి బాగుంటేనే వాహనం ముందుకు కదులుతుంది. వాటిపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇక వాహనం టైర్ల గురించి దాదాపు అందరికి తెలిసిందే. కానీ విమానం టైర్ల గురించి అందరికి పెద్దగా తెలిసి ఉండదు. విమానం ల్యాండింగ్‌ అయ్యే సమయంలో వాటి టైర్లు వేగంగా నేలను బలంగా తాకుతాయి. విమానం ల్యాండింగ్‌ సమయంలో దాని ఒత్తిడి తట్టుకుని టైర్లు వేగంగా ముందుకు కదులుతాయి. మరి అంత ఒత్తిడికి ఎలా తట్టుకోగలుగుతాయనే విషయం మీకెప్పుడైనా అనుమానం వచ్చిందా?. విమానం టైర్లు ప్రత్యేకంగా తయారు చేయబడి ఉంటాయి. ఎంతటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తి ఉంటుంది. విమానం ల్యాండింగ్‌ సమయంలో తీవ్రమైన ఒత్తిడి ఉన్నా పేలకుండా ఉంటాయి. విమానం టైర్లు వేల పౌండ్ల బరువు, అధిక వేగాన్ని తట్టుకోగలవు. అవి ప్రత్యేకంగా తయారు చేయడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. విమానం టైర్లను చాలా దృఢంగా తయారు చేయబడి ఉంటాయి. ఇందులో నైట్రోజన్ వాయువు నింపబడుతుంది. దీని కారణంగా ల్యాండింగ్ సమయంలో కఠినమైన పరిస్థితుల్లో కూడా తట్టుకునే సామర్థ్యం ఉంటుంది.

విమానం టైర్లలో ఏయే పదార్థాలు కలుస్తాయి:

విమానం టైర్ల తయారీలో అల్యూమినియం, స్టీల్‌, నైలాన్‌ వంటివి కలుస్తాయి. ఈ టైర్లు సింథటిక్ రబ్బరు సమ్మేళనాల కలయికతో తయారు చేయబడతాయి. ఇందులో అల్యూమినియం స్టీల్, నైలాన్‌ టైర్లు బలోపేతం అయ్యేందుకు ఉపయోగపడతాయి. వల్కనైజేషన్‌ అనే రసాయనిక ప్రక్రియ ద్వారా టైర్లు ఏర్పడతాయి. ఈ ప్రక్రియలో క్రాస్‌ లింకింగ్‌ ద్వారా పలిమర్‌లను మరింత మన్నికైన పదార్థాలుగా మారుతాయి. విమానం ల్యాండింగ్‌ సమయంలో ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఇవి పగిలిపోవు. ఎలాంటి సమస్య రాదు. విమానం టైర్లు ట్రక్ టైర్ల కంటే రెండింతలు పెంచి ఉంటాయి. కార్ టైర్ల కంటే ఆరు రెట్లు ఎక్కువ గాలి ఉంటుంది. ఈ టైర్లను తయారు చేస్తున్నప్పుడు వాటి పరిమాణం, విమానం ఆధారంగా దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తారు.

టైర్లలో ప్రత్యేకమైన గాలి:

ఈ టైర్లలో ఓ ప్రత్యేకమైన గాలిని నింపుతారు. దీనిని నైట్రోజన్ వాయువు అంటారు. విమానం టైర్లు నైట్రోజన్‌తో నింపబడి ఉంటాయి. నత్రజని జడ వాయువు కాబట్టి అధిక ఉష్ణోగ్రత, పీడన మార్పుల ప్రభావం వాటిపై తక్కువగా ఉంటుంది. టైర్లను తయారు చేసిన తర్వాత 38 టన్నుల వరకు బరువుతో పరీక్షిస్తారు. ఎన్నో రకాల పరీక్షల తర్వాతే విమానాలకు బిగిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి