Gold: మనదేశంలో బంగారం ఎక్కువగా దాచుకున్న ప్రజలు ఈ జిల్లాల వారే.. సర్వేలో కీలక విషయాలు
బంగారం.. ఇది మహిళలకు ఎంతో ఇష్టమైనది. పసిడికి భారతదేశంలో ప్రత్యేక స్థానముంది. ఇందుకే భారతీయ మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు..
బంగారం.. ఇది మహిళలకు ఎంతో ఇష్టమైనది. పసిడికి భారతదేశంలో ప్రత్యేక స్థానముంది. ఇందుకే భారతీయ మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇందుకే ప్రపంచంలోనే బంగారం వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆభరణాలు, పెట్టుబడికి బలమైన డిమాండ్ కారణంగా, ప్రతి సంవత్సరం వందల టన్నులకొద్ది బంగారం దిగుమతి అవుతోంది. కానీ భారతదేశంలోని ప్రజల్లో ఆర్థికంగా చాలా చిన్న విభాగంలో ఉండే ఒక వర్గం పొదుపు ప్రయోజనం కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా కొన్ని నెలవారీ ఆదాయం 50 వేల రూపాయల కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలూ పొదుపు కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు నివేదికలు వెల్లడవుతున్నాయి. దేశంలో ప్రతి సంవత్సరం 800 టన్నుల బంగారం ఖర్చవుతుంది. అందులో 600 టన్నులకు పైగా ఆభరణాలుగా భద్రంగా ఉంటున్నాయి. ఇది కాకుండా ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రతి సంవత్సరం 180 టన్నులకు పైగా బంగారు కడ్డీలు అలాగే నాణేలు కూడా వినియోగిస్తున్నారు. అయితే ఇందులో బంగారాన్ని వినియోగించే ప్రధాన భాగం అధిక ఆదాయ వ్యక్తుల నుండి వస్తుంది.
బంగారం నిల్వలపై సర్వే
మనీ 9 భారతీయ కుటుంబాల ఆదాయాలు, ఖర్చులు, పొదుపులు, పెట్టుబడుల నమూనాపై ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భారతదేశంలోని 15% కుటుంబాలు మాత్రమే పొదుపు కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని తేలింది. ఆ 15 శాతం కుటుంబాలలో కూడా 29 శాతం వాటా నెలవారీ ఆదాయం 50 వేల రూపాయల కంటే ఎక్కువ ఉన్న ఆ కుటుంబాలదే అని సర్వేలో స్పష్టం అయ్యింది. అత్యల్ప ఆదాయ సమూహంలోని కుటుంబాలు అంటే నెలవారీ ఆదాయం 15 వేల రూపాయల కంటే తక్కువ ఉన్న వారిలో 8% మాత్రమే పొదుపు కోసం బంగారం కొంటున్నారు.
దేశంలో పొదుపు కోసం బంగారం కొనుగోలు చేసే కుటుంబాలు కర్ణాటకలోనే అత్యధికంగా ఉన్నాయని ఆ సర్వేలో వెల్లడైంది. దీని తరువాత స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్రలు ఉన్నాయి. గుజరాత్‌లోని సూరత్, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, మహారాష్ట్రలోని థానే, కర్ణాటక లోని బళ్లారి ఇలా పొదుపు కోసం బంగారం కొనే జిల్లాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. కర్ణాటకలోని బళ్ళారి అలాగే ఉత్తర కన్నడ జిల్లాలు దేశంలో బంగారం నిల్వలలున్న మొదటి ఐదు జిల్లాలుగా ఉన్నాయి.
దేశంలో అధిక సంఖ్యలో ఆర్థికంగా ఉన్న కుటుంబాలు ఉన్న ప్రాంతాల్లో బంగారం నిల్వ ఎక్కువగా ఉన్నట్లు మనీ9 సర్వే స్పష్టం చేస్తోంది. చాలా చోట్ల బంగారం కొనుగోలు ఎక్కువగా ఉంది. చాలా చోట్ల ఇది చాలా తక్కువగా ఉంది. దేశంలో బంగారం కొనుగోలులో అసమానత నెలకొనడానికి ఇదే కారణంగా చెప్పవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..