Rs 2000 Notes: 2 వేల రూపాయల నోట్లు రద్దు కానున్నాయా..? నిలిచిపోయిన ముద్రణ

దేశంలో నోట్ల రద్దు తర్వాత 2వేల రూపాయల నోట్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ నోట్లు పెద్దగా కనిపించడం..

Rs 2000 Notes: 2 వేల రూపాయల నోట్లు రద్దు కానున్నాయా..? నిలిచిపోయిన ముద్రణ
Rs 2000 Notes
Follow us
Subhash Goud

|

Updated on: Nov 21, 2022 | 7:15 AM

దేశంలో నోట్ల రద్దు తర్వాత 2వేల రూపాయల నోట్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ నోట్లు పెద్దగా కనిపించడం లేదు. ఎక్కడ చూసినా రూ.500 నోట్లు, రూ.100 నోట్లే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండువేల రూపాయల నోట్ల ముద్రణ నిలిపివేసినట్లు ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలిపిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం.. రూ.2000 నోట్ల సరఫరా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు, నాసిక్‌ కరెన్సీ నోట్‌ ప్రెస్‌, బ్యాంకు నోట్‌ ప్రెస్‌ దేవాస్‌ల నుంచి జరుగుతుంది.

2019 నుంచి ఒక్కనోటు కూడా ముద్రించలేదట

2019 నుంచి ఇప్పటి వరకు ఒక్క రెండు వేల రూపాయల నోట్లు కూడా ముద్రించలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్‌ ముద్రణ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇటీవల ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా ఇచ్చింది.2016 నుంచి ఆర్బీఐ ఈ నోట్ల ముద్రణను తగ్గిస్తూ వస్తోందని కేంద్ర బ్యాంకు తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. 2017 మార్చి 31 నాటికి ఆర్థిక వ్యవస్థలో 50.2శాతం పింక్‌ నోట్ల వాటా ఉండగా, ఈ ఏడాది మార్చి 31నాటికి అది 13.8 శాతానికి పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే 2020లో ఈ నోట్లు మొత్తం 274 కోట్లు మార్కెట్లో చెలామణిలో ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం ఈ సంఖ్య 214 కోట్లకు పడిపోయినట్లు ఆర్బీఐ తన వార్షిక నివేదికలు తెలిపింది. అయితే బ్యాంకులు కూడా చిన్న డినామినేషన్ల నోట్లనే ఎక్కువగా అడుగుతున్నాయని, సామాన్యులు పెద్ద నోట్లను కోరుకోవడం లేదని తెలుస్తోంది.

2 వేల నోటు రద్దు అవుతుందా..?

ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో 31.05 లక్షల కోట్ల రూపాయల నగదు చెలామణిలో ఉందని ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి. నగదు వాడకంలో ఇది రికార్డు స్థాయి. మరో వైపు నకిలీ రెండువేల నోట్లు మార్కెట్లో భారీగానే వస్తున్నాయి. అధికారులు దాడులు చేసి ఇప్పటికే చాలా నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 వేల రూపాయల నకిలీ నోట్ల ముద్రణ దాదాపు 55 శాతంకుపైగా పెరిగినట్లు కేంద్ర బ్యాంకు గుర్తించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే 2 వేల రూపాయల నోట్లను ముద్రించే పరిస్థితి కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే 2016తో పోలిస్తే 2 వేల రూపాయల నోట్ల చెలామణి భారీగా తగ్గిపోయింది. ఇందుకు కారణంగా ఈ నోట్ల ముద్రణను నిలిపివేయడం. నోట్లను పూర్తిగా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎలాంటి క్లారిటీ లేకపోయినా ముద్రణ మాత్రం నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి

2016లో దేశంలోని 1000రూపాయలు, 500 రూపాయల నోట్లను మోడీ సర్కార్ రద్దు చేసిన తర్వాత 2000 రూపాయల నోట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే క్రమ క్రమంగా నోట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2016 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కరెన్సీలో వెయ్యి, ఐదువందల రూపాయల నోట్ల వాటా 80 శాతం వరకు ఉండగా, గత మూడేళ్ళుగా రెండువేల రూపాయల నోట్ల ముద్రణ నిలిపివేసింది ఆర్బీఐ. సమాచార హక్కు ద్వారా ప్రముఖ వార్తా సంస్థ ఐఏఎన్‌ఎస్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈమేరకు సమాధానమిచ్చింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలోని కరెన్సీ ముద్రణాలయాలు నిర్విరామంగా పనిచేసినా పెద్ద మొత్తంలో కరెన్సీని ముద్రించడం కష్టమే. దీంతో 2 వేల నోట్ల ముద్రణను మొదలుపెట్టిన ఆర్బీఐ.. క్రమంగా ఆ నోట్ల ప్రింటింగ్‌ను తగ్గించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 35,429.91 కోట్ల 2 వేల నోట్లను ముద్రించిన ఆర్బీఐ నోట్‌ ముద్రణ్ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. 2017-18లో 1,115.7 కోట్ల నోట్లను, 2018-19లో కేవలం 466.90 కోట్ల నోట్లను మాత్రమే ముద్రించింది. ఆ తర్వాత 2019 నుంచి ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..