Gold Price Today: రూ.53 వేలు దాటిన బంగారం ధర.. వెండి అక్కడ మాత్రం రూ.67,500

దీపావళి పండగ తర్వాత బంగారానికి రెక్కలు వచ్చాయి. మహిళలు అత్యంత ఇష్టపడి బంగారం రోజురోజుకు పెరుగుతోంది. ఇక తాజాగా..

Gold Price Today: రూ.53 వేలు దాటిన బంగారం ధర.. వెండి అక్కడ మాత్రం రూ.67,500
Gold Price Today
Follow us
Subhash Goud

|

Updated on: Nov 21, 2022 | 6:30 AM

దీపావళి పండగ తర్వాత బంగారానికి రెక్కలు వచ్చాయి. మహిళలు అత్యంత ఇష్టపడి బంగారం రోజురోజుకు పెరుగుతోంది. ఇక తాజాగా నవంబర్‌ 21న దేశీయంగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇక వెండి ధర స్వల్పంగా పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో ఏ సమయంలోనైనా పెరగవచ్చు. తగ్గవచ్చు. మీరు బంగారం కొనుగోలు చేసే సమయానికి ముందు ధరలు తెలుసుకోవడం ముఖ్యం.

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,250 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,730 వద్ద నమోదైంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.53,020 వద్ద ఉంది.

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.48,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,170 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.48,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,070 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 వద్ద కొనసాగుతోంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,020 వద్ద కొనసాగుతోంది.

➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 ఉంది.

వెండి ధర:

➦ చెన్నైలో కిలో వెండి ధర రూ.67,500, ముంబైలో రూ.61,000, ఢిల్లీలో రూ.61,000, కోల్‌కతాలో కిలో వెండి రూ.61,000, బెంగళూరులో రూ.67,500, హైదరాబాద్‌లో రూ.67,500, విశాఖలో రూ.67,500 వద్ద ఉంది.