UPI Transactions: డిజిటల్ ట్రాన్సక్షన్ చేసే వారు అలర్ట్‌.. యూపీఐ లావాదేవీలపై పరిమితి!

మీరు డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా..

UPI Transactions: డిజిటల్ ట్రాన్సక్షన్ చేసే వారు అలర్ట్‌.. యూపీఐ లావాదేవీలపై పరిమితి!
UPI Transactions
Follow us

|

Updated on: Nov 21, 2022 | 8:17 AM

మీరు డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్స్ (టీపీఏపీ) నిర్వహిస్తున్న యూపీఐ చెల్లింపు సేవ కోసం మొత్తం లావాదేవీల పరిమితిని 30 శాతానికి పరిమితం చేసే నిర్ణయంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఎన్‌పీసీఐ డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. ఈ సమయంలో లావాదేవీ పరిమితి లేదు. అటువంటి పరిస్థితిలో గూగుల్‌పే, పోన్‌పే అనే రెండు కంపెనీల మార్కెట్ వాటా దాదాపు 80 శాతానికి పెరిగింది.

థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్స్ (టీపీఏపీ) కోసం 30 శాతం లావాదేవీ పరిమితిని నిర్ణయించాలని ఎన్‌పీసీఐ నవంబర్ 2022లో ప్రతిపాదించింది. పీటీఐ నివేదిక ప్రకారం.. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించడానికి ఒక సమావేశాన్ని నిర్వహించినట్లు సంబంధించిన వర్గాలు తెలిపాయి. ఎన్‌పిసిఐ అధికారులతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బిఐ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రస్తుతం ఎన్‌పీసీఐ అన్ని అవకాశాలను అంచనా వేస్తోందని, డిసెంబర్ 31 గడువును పొడిగించడంపై తుది నిర్ణయం తీసుకోలేదని వర్గాలు తెలిపాయి. గడువును పొడిగించాలని పరిశ్రమ వాటాదారుల నుండి ఎన్‌పిసిఐకి అభ్యర్థనలు అందాయని, వాటిని పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. ఈ నెలాఖరులోగా యూపీఐ మార్కెట్ క్యాప్‌ను అమలు చేసే అంశంపై ఎన్‌పీసీఐ నిర్ణయం తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది కాకుండా, మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సదుపాయాన్ని ఉపయోగించవచ్చు. మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ ద్వారా మీ మొబైల్ బిల్లును కూడా చెల్లించవచ్చు. మీరు 123PAY UPI సేవ సహాయంతో దీన్ని చేయవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇటీవలే 123PAY పవర్ బిల్లు చెల్లింపు సేవ ఇప్పుడు విద్యుత్ బోర్డులకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. 123PAY సేవ, భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ వినియోగంతో వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను త్వరగా, సులభంగా చెల్లించగలరు. కరెంటు బిల్లు నేరుగా బ్యాంకు ఖాతాల నుంచి చెల్లించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..