AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jharkhand: శ్రద్ధా హత్యోదంతం మరవకముందే మరో ఘోరం.. భార్యను చంపి.. ఎలక్ట్రిక్‌ కట్టర్‌తో 50 ముక్కలుగా కోసి..

ఓ మహిళను ఆమె భర్తే అతి కిరాతకంగా చంపేశాడు. అనంతరం ఎలక్ట్రిక్ కట్టర్ సహాయంతో శరీరాన్ని దాదాపు 50కి పైగా ముక్కలు ముక్కలుగా కోసి వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు.

Jharkhand: శ్రద్ధా హత్యోదంతం మరవకముందే మరో ఘోరం.. భార్యను చంపి.. ఎలక్ట్రిక్‌ కట్టర్‌తో 50 ముక్కలుగా కోసి..
Murder
Basha Shek
|

Updated on: Dec 18, 2022 | 6:23 PM

Share

దేశ రాజధాని నడిబొడ్డున జరిగిన శ్రద్ధా వాకర్‌ హత్యోదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రద్ధను ఆమె ప్రియుడే ఆఫ్తాబ్‌ పూనావాలా అత్యంత కిరాతకంగా చంపి 35 ముక్కలుగా కోసి చంపిన సంఘటన ఇప్పటికీ ఇంకా చాలామంది నోళ్లలో నానుతూనే ఉంది. మానవీయతకు మచ్చ తెచ్చేలా ఉన్న ఈ ఘటన గురించి విని దేశ ప్రజలందరూ ఉలిక్కి పడ్డారు. ఈ దారుణం మరిచిపోకముందే అదే తరహా ఘోరం ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళను ఆమె భర్తే అతి కిరాతకంగా చంపేశాడు. అనంతరం ఎలక్ట్రిక్ కట్టర్ సహాయంతో శరీరాన్ని దాదాపు 50కి పైగా ముక్కలు ముక్కలుగా కోసి వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ క్రమంలో శనివారం (డిసెంబర్‌ 17) సాయంత్రం ఓ పాత ఇంటి వద్ద ఓ మహిళ ఛిద్రమైన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ దారుణ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. మృతురాలి భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు ఈ హత్యోదంతంతో స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో 12 శరీర భాగాలను గుర్తించిన పోలీసులు.. మిగతా భాగాల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

అనుమానం రాకుండా..

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. మృతురాలు గిరిజన వర్గానికి చెందిన రుబికా పహాదిన్‌ (23)తో దిల్దార్‌ అన్సారీ (28) అనే వ్యక్తితో రెండేళ్లుగా సహజీవనం చేసి ఇటీవలే పెళ్లి చేసుకుంది. అయితే, ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రలోభానికి గురిచేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు సమాచారం. పైగా అతనికిది ఇది రెండో వివాహం. మహిళను చంపిన తర్వాత అనుమారం రాకుండా ఉండేందుకు నిందితుడు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్‌ కంప్లయింట్‌ కూడా ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. కాగా మృతురాలి భాగాలు మిస్‌ అయ్యాయని.. వాటి కోసం గాలింపు చేస్తున్నట్టు వారు వెల్లడించారు. మరోవైపు మహిళను చంపి ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసేందుకు నిందితులు ఎలక్ట్రిక్‌ కట్టర్‌లాంటి పదునైన ఆయుధాన్ని వాడినట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ కిరాతక చర్యలో మరికొందరి ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..