లోక్ సభ ఎన్నికల వేళ దేశంలో కాక రేపుతున్న రిజర్వేషన్ అంశం..

పార్లమెంట్ ఎన్నికల వేళ రిజర్వేషన్ రగడ కొనసాగుతూనే ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం సామాజిక వర్గాల రిజర్వేషన్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్‌ వార్ కంటిన్యూ అవుతోంది. మహారాష్ట్ర కొల్లాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్‌ వ్యతిరేకమన్నారు. కర్నాటకలో ముస్లింలను ఓబీసీల్లో చేర్చారని మండిపడ్డారు.

లోక్ సభ ఎన్నికల వేళ దేశంలో కాక రేపుతున్న రిజర్వేషన్ అంశం..
Modi Vs Priyanka
Follow us
Srikar T

|

Updated on: Apr 28, 2024 | 8:32 PM

పార్లమెంట్ ఎన్నికల వేళ రిజర్వేషన్ రగడ కొనసాగుతూనే ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం సామాజిక వర్గాల రిజర్వేషన్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైలాగ్‌ వార్ కంటిన్యూ అవుతోంది. మహారాష్ట్ర కొల్లాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్‌ వ్యతిరేకమన్నారు. కర్నాటకలో ముస్లింలను ఓబీసీల్లో చేర్చారని మండిపడ్డారు. దీంతో ఓబీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కర్నాటక మోడల్‌ అమలవుతుందని హెచ్చరించారు ప్రధాని మోదీ. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమి మోదీ విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో కూటమికి మూడండెకల సీట్లు కూడా రావు, కాని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఇండియా కూటమి అధికారం లోకి వస్తే ఏడాదికి ఓ ప్రధాని ఉంటారని సెటైర్లు విసిరారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులవుతారని అన్నారు మోదీ.

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీ.. మోదీ అన్ని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. తన జీవితంలో చాలామంది ప్రధానులను చూశానని, కానీ ఇంత పచ్చి అబద్ధాలను చెప్పే ప్రధానిని చూడడం ఇదే తొలిసారి అని అన్నారు. బీజేపీ ఈసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని వల్సాద్‌ సభలో ప్రియాంక ఆరోపించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు, మంత్రులు ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా చెబుతున్నారు, బీజేపీ అధికారంలోకి వస్తే అదే నిజమవుతుందన్నారు ప్రియాంక. ఎన్నికల వేళ రిజర్వేషన్ల అంశం రాజకీయ పార్టీల మధ్య చర్చనీయ అంశంగా మారింది. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ను దోషిగా చూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే.. మోదీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ పదే పదే చెప్తోంది. అయితే ఓటరు ఎవరి మాట వింటాడనే విషయం తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ కోటాలో 27 శాతం రిజర్వేషన్‌ను ముస్లింలకు ఇవ్వడానికి ఒక కాగితంపై రాత్రికి రాత్రి స్టాంప్ వేసి ముస్లింలందరిని ఓబీసీలుగా మార్చారు. దీంతో ముస్లింలు ఓబీసీ కోటా రిజర్వేషన్ పొందేందుకు అర్హత సాధించారు. ఫలితంగా ఓబీసీల ప్రయోజనాలన్నీ ముస్లింలు దోచుకున్నారు. ఇప్పుడు ఈ ఫార్మూలా దేశవ్యాప్తంగా అమలుచేయాలని అనుకుంటున్నారు. మీరు దీనికి సహకరిస్తారా? అని మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రశ్నించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు, మంత్రులు ప్రతీ చోటకు వెళ్లి రాజ్యాంగాన్ని మార్చుతామని చెప్తున్నారు. కాని మోదీ మాత్రం అలాంటిదేమి లేదని అంటున్నారు. గత పది సంవత్సరాలుగా దేశాన్ని బీజేపీ ఎలా పరిపాలించిందో మనకు తెలుసు. భవిష్యత్‌లో ఏం చేయబోతున్నారో మంత్రులు, కార్యకర్తల ద్వారా ముందే చెప్పిస్తున్నారని కీలక ఆరోపణలు చేస్తున్నారు ప్రియాంక గాంధీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!