Watch Video: తమిళనాట తాగు నీటి కష్టాలు.. ముందస్తు చర్యలకు ఆదేశించిన సీఎం స్టాలిన్..
తమిళనాడును నీటి కరువు వెంటాడుతోంది. ప్రధానంగా.. చెన్నైలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. దేశంలో ఎక్కడ చూసినా నీటి కష్టాలు మొదలయ్యాయి. దీనికి కారణం వేసవి తాపం తీవ్రంగా పెరిగిపోవడమే. ఎండాకాలం ప్రారంభానికి ముందు నుంచే వర్షాలు కనుమరుగైయ్యాయి. దీని ప్రభావంతో అటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. నేటికీ కర్ణాటకలో మంచి నీటి కష్టాలు కొనసాగుతూనే ఉంది.
తమిళనాడును నీటి కరువు వెంటాడుతోంది. ప్రధానంగా.. చెన్నైలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. దేశంలో ఎక్కడ చూసినా నీటి కష్టాలు మొదలయ్యాయి. దీనికి కారణం వేసవి తాపం తీవ్రంగా పెరిగిపోవడమే. ఎండాకాలం ప్రారంభానికి ముందు నుంచే వర్షాలు కనుమరుగైయ్యాయి. దీని ప్రభావంతో అటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. నేటికీ కర్ణాటకలో మంచి నీటి కష్టాలు కొనసాగుతూనే ఉంది. ఇది తాజాగా తమిళనాడుకు చేరింది. చెన్నై నగరంలోని పులల్, పూండి, చంబరపాకం, చోళవరం రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా జరగాల్సి ఉంది. అయితే.. ఆయా రిజర్వాయర్లు దాదాపు ఖాళీ అవడంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో.. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయింది. వచ్చే రెండు నెలల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు సీఎం స్టాలిన్. దాంతో.. ముందస్తు చర్యల కోసం అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టుల్లోని నీటి నిల్వల వివరాలు ఇవ్వాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. ట్యాంకర్లతో నీటి సరఫరాకు ఆర్డర్స్ ఇచ్చారు. అలాగే.. వేసవి నీటి ఎద్దడి సమస్యను దృష్టిలో ఉంచుకుని పొదుపుగా వాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సీఎం స్టాలిన్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

