Watch Video: ‘రాత్రికి రాత్రి సంపద ఎలా సృష్టిస్తారు బాబు’.. సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్..
చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చేందుకు వీలుండదన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు హామీలపై విమర్శించారు. అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మళ్లీ సిద్దమయ్యారని అన్నారు. ఎన్నికల ముందు వందల హామీలను ఇవ్వడం చంద్రబాబుకు అలవాటని అన్నారు.
చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చేందుకు వీలుండదన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు హామీలపై విమర్శించారు. అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మళ్లీ సిద్దమయ్యారని అన్నారు. ఎన్నికల ముందు వందల హామీలను ఇవ్వడం చంద్రబాబుకు అలవాటని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే తలలో చిప్ పోయినట్టు ఉందన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని చరిత్ర ఆయనకు ఉందన్నారు సజ్జల. సీఎం జగన్ మాత్రం 99 శాతం మేనిఫెస్టోను అమలు చేశారన్నారు. ఆచరణ సాధ్యమయ్యే హామీను మాత్రమే వైసీపీ ఇచ్చిందన్నారు సజ్జల. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు సంపద సృష్టిస్తా అంటున్నారు. అసలు సంపదను ఎలా సృష్టిస్తారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఏమి సృష్టించారని అడిగారు. రాత్రికి రాత్రి సంపద ఎక్కడ నుంచి వస్తుందని చంద్రబాబును నిలదీశారు. పరిశ్రమలు ఎన్ని తీసుకొచ్చినా వాటికి మౌళిక సదుపాయాలు కల్పించడం, ఉత్పత్తి ప్రారంభించడం ఆ తరువాత వాటికి మార్కెట్ చేస్తే సంపద వస్తుందని తెలిపారు. ఇవన్నీ ఉన్నపళంగా ఎక్కడి నుంచి తీసుకొస్తారని వీటికి కూడా కొంత సమయం పడుతుందని ప్రజలు లాజికల్గా ఆలోచించాలని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో

