Watch Video: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై విమర్శలు..
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆదివారం సాయంత్రం రోడ్ షో నిర్వహించిన రేవంత్ రెడ్డి బీజేపీపై మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో కాకుండా శ్రీరాముడి ఫోటోతో బీజేపీ ఓట్లు అడుగుతుందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో తగదని విమర్శించారు. మల్కాజిగిరితో పాటు ఎల్బీనగర్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కూడా సెటైర్లు విసిరారు.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆదివారం సాయంత్రం రోడ్ షో నిర్వహించిన రేవంత్ రెడ్డి బీజేపీపై మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో కాకుండా శ్రీరాముడి ఫోటోతో బీజేపీ ఓట్లు అడుగుతుందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో తగదని విమర్శించారు. మల్కాజిగిరితో పాటు ఎల్బీనగర్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కూడా సెటైర్లు విసిరారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సచివాలయానికి రాలేదని.. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక నియోజకవర్గాలను పర్యటిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు చేసిందేంటని ప్రశ్నించారు. గతంలో ప్రజలు ఎవరైనా ముఖ్యమంత్రిని కలిసేందుకు వస్తే గంటల తరబడి బయటే కూర్చోపెట్టారని మండిపడ్డారు. ప్రజాగాయకుడు గద్దర్ను కూడా గేటుబయటే కూర్చోబెట్టారని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ కు ఓటు వేయమని ప్రజలను కోరారు సీఎం రేవంత్ రెడ్డి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..