దేశంలో పెద్ద ఎత్తున పట్టుబడిన డ్రగ్స్.. సీక్రెట్ ఆపరేషన్‌ను చేధించిన అధికారులు..
గుజరాత్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో టీం పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను పట్టుకుంది. రూ. 600 కోట్ల రూపాయల విలువ చేసే సుమారు 86 కిలోల డ్రగ్స్‌ని సీజ్ చేశారు కోస్టల్ అధికారులు. దేశంలోకి అక్రమంగా డ్రగ్స్‌ను తరలిస్తున్న 14 మంది ముఠాను, పాకిస్తాన్ బోటును విచారణ నిమిత్తం పోర్ బందర్‌కు తరలించారు. ఈ సీక్రెట్ జాయింట్ ఆపరేషన్‌లో కోస్ట్ గార్డ్, ఏటీసీ సిబ్బంది, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పాల్గొన్నారు.
గుజరాత్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో టీం పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను పట్టుకుంది. రూ. 600 కోట్ల రూపాయల విలువ చేసే సుమారు 86 కిలోల డ్రగ్స్‌ని సీజ్ చేశారు కోస్టల్ అధికారులు. దేశంలోకి అక్రమంగా డ్రగ్స్‌ను తరలిస్తున్న 14 మంది ముఠాను, పాకిస్తాన్ బోటును విచారణ నిమిత్తం పోర్ బందర్‌కు తరలించారు. ఈ సీక్రెట్ జాయింట్ ఆపరేషన్‌లో కోస్ట్ గార్డ్, ఏటీసీ సిబ్బంది, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పాల్గొన్నారు. గుజరాత్ సముద్ర తీరం వెంబడి గుట్టు చప్పుడు కాకుండా మాదకద్రవ్యాలను తీసుకెళ్తున్న పాకిస్తాన్ బోటును అడ్డగించడంలో కోస్ట్ గార్డ్ షిప్ రాజ్‌రతన్ కీలక పాత్ర పోషించింది. డ్రగ్స్ అక్రమ రవాణా సిండికేట్‌ను అరికట్టడానికి ఇంటెలిజెన్స్ అధికారులు కీలక పాత్ర పోషించారు. ఈ ఆపరేషన్‌లో చిన్న పడవలతో పాటు ప్రత్యేక విమానాలను మొహరించారు అధికారులు. రాత్రి సమయంలో సముద్ర మార్గం గుండా ఈ డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడటంతో ఆపరేషన్ సక్సెస్ చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు అక్రమ రవాణాకు పాల్పడుతున్న 14 మందితో కూడిన ముఠాను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు అధికారులు.
ఇదిలా ఉంటే గతంలో గుజరాత్, రాజస్థాన్‌లో రహస్యంగా నడుపుతున్న డ్రగ్ ల్యాబ్‌ల గుట్టు రట్టు చేశారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు. ఈ రెండు రాష్ట్రాల కేంద్రంగా సాగుతున్న పలు ప్రాంతం ప్రత్యేక బృందాలు తనిఖీ నిర్వహించాయి. ఈ క్రమంలోనే మూడు తయారీ కేంద్రాల నుంచి సుమారు రూ. 300 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు అధికారులు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే గుజరాత్ తీరంలో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో డ్రగ్స్ మాఫియా, అక్రమ రవాణాపై మరింత దృష్టి సారించారు కోస్టల్, నార్కొటిక్, ఇంటెలిజెన్స్ అధికారులు.