AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: కాంగ్రెస్ పార్టీకి మొఘల్ ఆలోచన…ఔరంగజేబు దురాగతాలు గుర్తుకు రావడం లేదాః ప్రధాని మోదీ

లోక్‌సభ ఎన్నికల్లో 400 దాటాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ.. మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. పార్టీ పెద్ద నేతలంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి పార్టీ దక్షిణాది రాష్ట్రాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తోంది బీజేపీ అధిష్టానం. అదే సమయంలో పార్టీని గెలిపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

PM Modi: కాంగ్రెస్ పార్టీకి మొఘల్ ఆలోచన...ఔరంగజేబు దురాగతాలు గుర్తుకు రావడం లేదాః ప్రధాని మోదీ
Pm Modi In Belagavi
Balaraju Goud
|

Updated on: Apr 28, 2024 | 2:02 PM

Share

లోక్‌సభ ఎన్నికల్లో 400 దాటాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ.. మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. పార్టీ పెద్ద నేతలంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి పార్టీ దక్షిణాది రాష్ట్రాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తోంది బీజేపీ అధిష్టానం. అదే సమయంలో పార్టీని గెలిపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం కర్ణాటక చేరుకున్నారు.

కర్ణాటకలో ప్రధాని మోదీ మొదట బెలగావిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే, ప్రధానమంత్రి చాలా దూకుడుగా కనిపించారు. తన ప్రసంగంలో కాంగ్రెస్ తోపాటు ఇండియా కూటమిపై ప్రధాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపులకే ప్రాధాన్యత ఇస్తుందని, వారికి నేహా లాంటి కూతుళ్ల ప్రాణాలకు విలువ లేదన్నారు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు గురించి మాత్రమే ఆందోళన చెందుతోంది. బెంగుళూరు కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడును కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోలేదని ప్రధాని మండిపడ్డారు.

పీఎఫ్‌ఐని ఓట్ల కోసం కాంగ్రెస్ ఉపయోగించుకుందని, ఇది ఉగ్రవాదాన్ని ఆశ్రయిస్తున్న దేశ వ్యతిరేక సంస్థ అని, దానిని బీజేపీ ప్రభుత్వం నిషేధించిందని ప్రధాని మోదీ అన్నారు. వాయనాడ్ సీటును గెలుచుకునేందుకు కాంగ్రెస్ ఆ సంస్థను సమర్థిస్తోంది. పీఎఫ్‌ఐ ఉగ్రవాద సంస్థను కాంగ్రెస్ ఒక్క సీటు కోసమే కాపాడుతోందని ప్రధాని దుయ్యబట్టారు.

ఆ తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ప్రధాని మోదీ టార్గెట్ చేశారు. కాంగ్రెస్ యువరాజుకు మన రాజులు, చక్రవర్తుల కృషి గుర్తుండదని ప్రధాని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇంతమంది రాజులు, చక్రవర్తులపై మాట్లాడుతున్నారని, అయితే నవాబులు, చక్రవర్తులు, సుల్తానులపై ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం వారికి లేదన్నారు. భారతదేశంలోని మహారాజు పేదల భూమిని లాక్కునేవాడని యువరాజు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మోదీ తప్పుబట్టారు. వందలాది దేవాలయాలను కూల్చివేసి అపవిత్రం చేసిన ఔరంగజేబు దురాగతాలు కాంగ్రెస్‌కు గుర్తుండవన్నారు.

ఈవీఎం సాకుతో దేశం పరువు తీసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ప్రధాని అన్నారు. వారందరికీ కోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేలా కాంగ్రెస్ పని చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రజలు మానసికంగా ఆంగ్లేయుల బానిసత్వంతో బతుకుతున్నారు. కాంగ్రెస్ దేశ ప్రయోజనాలకు దూరమై, కుటుంబ ప్రయోజనాలతో చిక్కుకుపోయిందన్నారు ప్రధాని మోదీ.

దీంతో పాటు ఆయన పదేళ్ళ ఎన్‌డీఏ ప్రభుత్వం సాధించిన విషయాలను వివరించారు. కర్ణాటకలో ఎక్కడికి వెళ్లినా ఒకే ఒక్క గొంతు వినిపించిందని, మరోసారి మోదీ ప్రభుత్వం. గత 10 ఏళ్లలో భారతదేశం శక్తివంతంగా మారిందని ప్రధాని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్య మాతగా గుర్తింపు పొందడం ప్రారంభించింది. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. దేశం పురోగమిస్తున్నప్పుడు ప్రతి భారతీయుడు సంతోషిస్తాడని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! గంటలో కాసుల వర్షం..
కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! గంటలో కాసుల వర్షం..
ఈ బియ్యం తింటే పీసీవోఎస్ మాయం.. బరువు కంట్రోల్..!
ఈ బియ్యం తింటే పీసీవోఎస్ మాయం.. బరువు కంట్రోల్..!