RSS Chief: అవసరమైనంత కాలం రిజర్వేషన్లను కొనసాగించాల్సిందే.. వాటికి RSS వ్యతిరేకం కాదుః మోహన్‌ భగవత్

రిజర్వేషన్లను తొలగించేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయంటూ కాంగ్రెస్‌ చేస్తోన్న వాదన రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ ఆరోపణలకు రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పందించారు. రాజ్యాంగం ప్రకారం అన్ని రిజర్వేషన్లను సంఘ్ మొదటి నుంచి సమర్థిస్తోందని, అయితే కొందరు తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మండిపడ్డారు.

RSS Chief: అవసరమైనంత కాలం రిజర్వేషన్లను కొనసాగించాల్సిందే.. వాటికి RSS వ్యతిరేకం కాదుః మోహన్‌ భగవత్
Mohan Bhagwat
Follow us

|

Updated on: Apr 28, 2024 | 1:40 PM

రిజర్వేషన్లను తొలగించేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయంటూ కాంగ్రెస్‌ చేస్తోన్న వాదన రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ ఆరోపణలకు రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పందించారు. రాజ్యాంగం ప్రకారం అన్ని రిజర్వేషన్లను సంఘ్ మొదటి నుంచి సమర్థిస్తోందని, అయితే కొందరు తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు దశల్లో 190 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఇంకా ఐదు దశలు మిగిలి ఉన్నాయి. అయితే సంఘ్ మాత్రం తాను ఏ విధంగానూ రాజకీయాల్లో లేనని స్పష్టంగా చెబుతోంది. ఇంతకు ముందు కూడా చాలా పార్టీల నేతలు బీజేపీ అధికారంలోకి వస్తే, రిజర్వేషన్లను ఎత్తివేస్తారంటూ తప్పుగా ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో, అదే వాదనతో ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. దానిపై మోహన్ భగవత్ క్లారిటీ ఇచ్చారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ రిజర్వేషన్‌ వ్యతిరేకమని, దీని గురించి బయట మాట్లాడలేమని ఓ వీడియో ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఇది పూర్తిగా అబద్ధమని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం అన్ని రిజర్వేషన్లకు సంఘ్ మద్దతు ఇస్తోందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తప్పుడు వీడియో ప్రచారంలో ఉందని, ఇది పూర్తిగా అవాస్తవం, తప్పు అన్నారు. రిజర్వేషన్లు ఉనికిలోకి వచ్చినప్పటి నుండి, సంఘ్ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లకు పూర్తి మద్దతునిస్తుంది. రిజర్వేషన్లు అవసరమని భావించినంత కాలం, సామాజిక కారణాల కోసం ఇచ్చిన వారికి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. ఆ వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగాలని మోహన్ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..