AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah Fake Video: అమిత్‌ షా ఫేక్‌ వీడియో వైరల్.. టీకాంగ్రెస్‌ పనే అంటున్న బీజేపీ.. రంగంలోకి ఢిల్లీ పోలీసులు..

లోక్ సభ సమరం ప్రారంభమైంది.. ఇప్పటికే.. రెండు విడతల పోలింగ్ ముగియగా.. మరో ఐదు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రధానంగా.. రిజర్వేషన్ల అంశంపై రాజకీయ రచ్చ నడుస్తోంది.. ఈ క్రమంలోనే ఫేక్‌ వీడియోలు జోరుగా సర్క్యులేట్‌ అవుతుండటం జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది.

Amit Shah Fake Video: అమిత్‌ షా ఫేక్‌ వీడియో వైరల్.. టీకాంగ్రెస్‌ పనే అంటున్న బీజేపీ.. రంగంలోకి ఢిల్లీ పోలీసులు..
Amit Shah
Shaik Madar Saheb
|

Updated on: Apr 29, 2024 | 11:31 AM

Share

లోక్ సభ సమరం ప్రారంభమైంది.. ఇప్పటికే.. రెండు విడతల పోలింగ్ ముగియగా.. మరో ఐదు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రధానంగా.. రిజర్వేషన్ల అంశంపై రాజకీయ రచ్చ నడుస్తోంది.. ఈ క్రమంలోనే ఫేక్‌ వీడియోలు అంతకంటే జోరుగా సర్క్యులేట్‌ అవుతుండటం జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ తొలగిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నట్లుగా ఒక వీడియో వైరల్‌ అవుతోంది. తెలంగాణలో ఇటీవల అమిత్ షా పర్యటించిన విషయం తెలిసిందే.. అయితే, సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారసభలో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణలు వస్తున్నాయి.

దీనిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది. ఈ ఫేక్‌ వీడియోపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఫేక్‌ వీడియోను అప్‌లోడ్‌ చేసిన వారి కోసం ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్‌ ఫ్యూజన్‌ అండ్ స్ట్రాటజిక్‌ ఆపరేషన్‌- IFSO అధికారులు వేట మొదలుపెట్టారు. ఈ వీడియో ఎక్కడ నుంచి అప్‌లోడ్ అయింది.. ఎవరు చేశారు.. అనే విషయాలను సేకరించేందుకు ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తును ప్రారంభించింది.

అయితే, తెలంగాణ కాంగ్రెస్ విభాగం ఈ ఫేక్‌ వీడియోను ప్రచారం చేస్తోందని బీజేపీ IT విభాగం ఇన్‌ఛార్జ్‌ అమిత్‌ మాలవీయ ఆరోపించారు. ముస్లింలకు ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్‌ను తొలగించడంపైనే అమిత్‌ షా మాట్లాడారనీ, కానీ రిజర్వేషన్లు అన్నింటినీ తొలగిస్తామని చెప్పలేదంటూ పేర్కొన్నారు. ఇలాంటి వీడియో సర్క్యులేట్‌ చేసినవారు న్యాయపరమైన పరిణామాలకు సిద్దం కావాలన్నారు.

అమిత్ మాలవీయ ట్వీట్ చూడండి..

కాగా.. రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అటు జాతీయ.. ఇటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..