Thalapathy Vijay: దళపతి విజయ్‌కు స్వీట్ వార్నింగ్.. వారసత్వాన్ని సొంతం చేసుకోవాలంటే..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో రాజకీయ ఆసక్తికరంగా మారాయి. రాజకీయాల్లో కులాలు ప్రాంతాలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో ఈ సమీకరణలు మరింతగా కనబడుతున్నాయి. తమిళ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే రాజకీయ పార్టీ రెండో మహానాడు సభ మదురై వేదికగా ఇటీవల జరిగింది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో రాజకీయ ఆసక్తికరంగా మారాయి. రాజకీయాల్లో కులాలు ప్రాంతాలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో ఈ సమీకరణలు మరింతగా కనబడుతున్నాయి. తమిళ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే రాజకీయ పార్టీ రెండో మహానాడు సభ మదురై వేదికగా ఇటీవల జరిగింది. మధురై వేదికగా సభ జరిగిన సందర్భంలో తన ప్రసంగంలో విజయ్ మదురై గురించి పదేపదే ప్రస్తావించారు. సినిమా రంగంలో తనదైన ముద్ర వేసి రాజకీయాల్లోకి వచ్చిన దివంగత నేత ఎంజి రామచంద్రన్ మధురై నుంచి పొలిటికల్ యాక్టివిటీని మొదలుపెట్టి రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు.. అంటూ మధురై గురించి సెంటిమెంట్ గా చెప్పుకొచ్చిన విజయ్ , తాను ఎంతగానో అభిమానించే నటుడు విజయ్ కాంత్ అలాగే డిఎండికే పార్టీని స్థాపించి సత్తా చాటిన విజయకాంత్ తనకు అన్నలాంటి వాడని మదురై గడ్డపై మంచి మాట్లాడుతూ ఆయన గురించి ప్రస్తావించకుండా ఉండలేనంటూ విజయ్ చెప్పడంతో ఒకసారి గా చప్పట్లు కేకలతో సభా ప్రాంగణం హోరెత్తింది. దివంగత విజయ్ కాంత్ గురించి విజయ్ చేసిన ప్రస్తావన ఇప్పుడు రాజకీయంగా దుమారం చెలరేగింది. విజయ్ విజయ్ కాంత్ గురించి ప్రస్తావించడం రాబోయే ఎన్నికల్లో విజయకాంత్ స్థాపించిన డిఎండికేతో కలిసి పొత్తు పెట్టుకుంటారని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. కలిసి ముందుకు వెళ్లే వివచనలు ఉన్న కారణంగానే ఆయన గురించి సభలో విజయ్ ప్రత్యేకంగా ప్రస్తావించారని చర్చ జరిగింది. 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్న డీఎంకేతో పొత్తు పెట్టుకుని 29 స్థానాల్లో విజయ్ కాంత్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత రాజకీయంగా మారిన పరిస్థితులు విజయ్ కాంత్ అనారోగ్యానికి గురి కావడంతో సీట్లు రాకున్నప్పటికీ ఓటు బ్యాంకు కలిగిన పార్టీగా డీఎండీకే పార్టీకి గుర్తింపు ఉంది. కాబట్టి డిఎండికేతో వద్దు అటు విజయ్‌కు కూడా కలిసి వస్తుందన్న చర్చ జరుగుతుండగా ఈ ప్రచారానికి విజయకాంత్ భార్య వ్యాఖ్యలతో ఫుల్ స్టాప్ పడ్డట్టు ఆయింది.
నటుడు విజయ్ తన భర్త విజయ్ కాంత్‌ను గురించి ప్రస్తావించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు.. ఇది సరైన పద్ధతి కాదంటూ డిఎండికే ప్రధాన కార్యదర్శి విజయ్ కాంత్ భార్య తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. నటుడు విజయ్ తండ్రి నిర్మాత అయిన చంద్రశేఖర్‌తో తన భర్త విజయకాంత్‌కు మంచి పరిచయం ఉండేదని.. నటుడు విజయ్ కూడా చిన్నప్పటి నుంచి విజయకాంత్‌కు తెలుసునని రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లు చెబుతూనే పరిచయం ఉన్నంత మాత్రాన ఎలాంటి సంప్రదింపులు ఎలాంటి చర్చలు లేకుండా పార్టీని విజయకాంత్ అభిమానులను ఓన్ చేసుకునే ప్రయత్నం మంచిది కాదని అన్నారు. విజయ్ కాంత్ వారసత్వాన్ని సొంతం చేసుకోవాలన్న ప్రయత్నాన్ని ప్రజలు అంగీకరించరని ప్రేమలత విజయ్ కాంత్ అన్నారు. అలాగే టీవీకే పార్టీ ఇంస్టాగ్రామ్ వీల్స్ లో విజయ్ కాంత్ ఫోటోలను ప్రసంగాలను వాడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రేమలత విజయ కాంత్. పొత్తుల గురించి అలాగే కలిసి ఎన్నికల ముందుకు వెళ్లే అంశం గురించి ఈరు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరగనప్పుడు ఇలా ఒక పార్టీ అభిమానాన్ని పార్టీ స్థాపించిన వ్యక్తిని సొంతం చేసుకున్నట్టు మాట్లాడడం మంచిది కాదని భవిష్యత్తులో ఇవి జరగకుండా ఉండడం మంచిదంటూ టీవీకే చీఫ్ విజయ్‌కు ప్రేమలత సున్నితంగా హెచ్చరిక చేశారు.




