Delhi Acid Attack Case: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు ఢిల్లీ మహిళా కమిషన్ వార్నింగ్.. అలా చేస్తే చర్యలు తప్పవంటూ లేఖ..
దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఇద్దరు దుండగులు ఓ బాలికపై యాసిడ్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 17 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది.

దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఇద్దరు దుండగులు ఓ బాలికపై యాసిడ్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 17 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం యువతికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ముఖంపై యాసిడ్ పడటంతో బాలిక ముఖం, మెడ కళ్లపై తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితురాలు తన చెల్లెలుతో కలిసి పాఠశాలకు వెళుతున్న సమయంలో ఇద్దరు యువకులు యాసిడ్ తో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, ద్వారకలో బాలికపై యాసిడ్ దాడి ఘటనను ఢిల్లీ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తంచేసింది. దీనిపై విచారణను సైతం ప్రారంభించింది. పాఠశాలకు వెళ్లే బాలికపై పట్టపగలు దుండగులు యాసిడ్ పోసి ఎలా పారిపోయారంటూ డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి సహాయం అందిస్తున్నామని తెలిపారు. దేశ రాజధానిలో క్షీణిస్తున్న శాంతి భద్రతల గురించి పోలీసులను మాలివాల్ పలు ప్రశ్నల సంధించారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ మహిళా కమిషన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సీఈవోలకు లేఖ రాసింది. నిందితులు ఆన్‌లైన్‌లో యాసిడ్ కొనుగోలు చేసినట్లు తేలినట్లు పేర్కొన్నారు. యాసిడ్ అమ్మడం చట్ట ప్రకారం నేరమని.. ఇలా చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఇలాంటివి అమ్మొద్దంటూ సూచించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం..
