Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepti Bahal: ఒకప్పటి ప్రిన్సిపాల్, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ లేడీ క్రిమినల్.. ఇంతకీ ఎవరు ఈ దీప్తి బాహల్..?

Bike Bot Scam & Deepti Bahal: ఉత్తర ప్రదేశ్‌లోని బాగ్‌పట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన దీప్తి బహల్ ఇప్పుడు ఆ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్. అమె కోసం ఇప్పుడు ఏకంగా మూడు వేర్వేరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వెతుకుతున్నాయి. అంతేనా.. ఆమెను పట్టుకుంటే రూ. 5 లక్షల..

Deepti Bahal: ఒకప్పటి ప్రిన్సిపాల్, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ లేడీ క్రిమినల్.. ఇంతకీ ఎవరు ఈ దీప్తి బాహల్..?
Bike Bot Scam; Deepthi Bahal(file Photo)
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 24, 2023 | 10:05 AM

Bike Bot Scam & Deepti Bahal: ఉత్తర ప్రదేశ్‌లోని బాగ్‌పట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన దీప్తి బహల్ ఇప్పుడు ఆ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్. అమె కోసం ఇప్పుడు ఏకంగా మూడు వేర్వేరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వెతుకుతున్నాయి. అంతేనా.. ఆమెను పట్టుకుంటే రూ. 5 లక్షల బహుమతి కూడా ప్రకటించారు. దీప్తి బహల్ ఎవరో కాదు.. యూపీలోని బైక్ బాట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు సంజయ్ భాటి భార్య, ఇంకా ఈ స్కామ్‌ వెనుక ఉన్న మూల హస్తం. ఇప్పుడు దీప్తి బహల్ కేసును విచారిస్తున్న ‘మీరట్ ఆర్థిక నేరాల విభాగం’.. దేశవ్యాప్తంగా ఆమె చేసిన బైక్ బాట్ స్కామ్ విలువ రూ.4,500 కోట్లు ఉంటుందని, ఆమెపై 250కి పైగా కేసులు నమోదైనట్లు అంచనా వేసింది. అయితే దీప్తి తనపై మొదటి కేసు(బైక్ బాట్ స్కామ్ 2019) నమోదైప్పటి నుంచి పరారీలో ఉంది. విశేషమేమిటంటే.. దీప్తి బాహల్ హిమాచల్ ప్రదేశ్‌లో ఒక స్కూల్, ఒక యూనివర్సటీ‌ని కూడా నడిపిస్తోంది. 

2019 నుంచి పరారీలోనే..

ఉత్తర్‌ ప్రదేశ్‌, పరిసర రాష్ట్రాలలో జరిగిన రూ. 4,500 కోట్ల విలువైన బైక్ బాటు కుంభకోణంపై.. 2019 లో తొలి కేసు నమోదైనప్పటి నుంచి దీప్తి పరారీలో ఉంది. సంజయ్ భాటితో వివాహానికి ముందు ఆమె బాగ్‌పట్‌లో టీచర్‌గా పనిచేసినట్లు విచారణలో తేలింది. అయితే ఆమె ఆ కాలేజీలో పనిచేసినట్లు సరైన రికార్డులు ఒక్కటీ దొరకలేదు. కానీ చౌధరీ చరణ్ సింగ్ యూనివర్సిటీ అనుబంధ కాలేజి అయిన బాగ్‌పట్‌లోని బరౌత్ కాలేజ్ ఎడ్యూకేషన్ తన వెబ్‌సైట్‌లో దీప్తిని తమ ప్రిన్సిపాల్‌గా పేర్కొంది. ఇంకా దీప్తికి ఎమ్‌ఏ, పిహెచ్‌డీ విద్యార్హత కూడా ఉన్నట్లుగా తెలిపింది.

మార్చి 2021లో దర్యాప్తు సంస్థలు గజియాబాద్‌ లోని(Loni)లో ఉన్న ఆమె ఇంటిని అధినంలోకి తీసుకున్నాయి. అంతకుముందు మీరట్‌లోని ఆమె ఇంట్లో సోదాలు చేసిన బృందాలు ఆమె 10 సంవత్సరాల క్రితం నగరం విడిచిపెట్టినట్లు గుర్తించారు. ఈ కుంభకోణంలో నమోదైన కేసులన్నింటినీ ఒక్కటిగా కలుపుతూ గతేడాది సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వాస్తవానికి ప్రభుత్వ సూచనల మేరకు ఈ కుంభకోణంపై విచారణ జరుపుతున్న ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ), దాద్రీ పోలీస్ స్టేషన్‌లో నిందితులపై నమోదైన మొదటి కేసును సీబీఐతో దర్యాప్తు చేయాలని హోం శాఖకు లేఖ పంపింది. 2019లో గౌతమ్ బుద్ నగర్‌లో జరిగిన ఈ బైక్ బాట్ స్కామ్‌తో సహా ఇతర సెక్షన్ల కింద దర్యాప్తు సంస్థకు పంపించడమైంది. మరోవైపు ఆమె దేశాన్ని విడిచి పెట్టి విదేశాలకు పారిపోయిందనే ప్రచారం కూడా సాగుతోంది.

ఇవి కూడా చదవండి

అసలేంటి ఈ బైక్ బాట్ స్కామ్..?

నోయిడా నివాసి, బిఎస్‌పి నాయకుడు, దీప్తి బహల్ భర్త సంజయ్ భాటి 2010 ఆగస్టులో ‘గర్విట్ ఇన్నోవేటివ్ ప్రమోటర్స్ లిమిటెడ్’ పేరుతో కంపెనీని స్థాపించారు. బైక్ బాట్ అనే మల్టీలెవల్ మార్కెటింగ్ పథకం కింద ఒక సంవత్సరంలో రెట్టింపు లాభాలు సంపాదించవచ్చంటూ పెట్టుబడిదారులను ఆకర్షించారు. ట్యాక్సీ బైక్ కోసం దాదాపు రూ.62,000 పెట్టుబడి పెట్టి 12 నెలల పాటు నెలకు రూ.9,765 ఇన్ స్టాల్ మెంట్ చెల్లిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ఒకటి కంటే ఎక్కువ బైక్‌లలో పెట్టుబడి పెడితే అదనపు బోనస్ ప్రోత్సాహకం కూడా లభిస్తుందని పెట్టుబడిదారులతో నమ్మబలికింది. అలా 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కంపెనీలో పెట్టుబడి పెట్టారు. అలా ‘బైక్ బాట్’ పేరుతో సేకరించిన పెట్టుబడులతో వాళ్లు పరారయ్యారు.

కాగా, బైక్ బాట్ కుంభకోణంపై ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 118 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా 96 కేసులు గౌతమ్ బుద్ధ నగర్‌లోనే నమోదయ్యాయి. ఇది కాకుండా బులంద్‌షహర్‌లో 6, ఘజియాబాద్‌లో 5, మీరట్, అలీగఢ్‌లలో 2, హాపూర్, బిజ్నోర్, బాగ్‌పత్, ఆగ్రా, ముజఫర్‌నగర్, లక్నోలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. గౌతమ్ బుద్ధ నగర్‌లో నమోదైన 11 కేసుల దర్యాప్తును 2021 అక్టోబర్ 22న ప్రభుత్వ ఆదేశాల మేరకు సీబీఐకి అప్పగించారు. మిగిలిన 107 కేసులను ఆర్థిక నేరాల విభాగం (EOW) మీరట్ శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే దీప్తిని పట్టుకుంటే రూ.5 లక్షల రివార్డు అందిస్తామని సదరు దర్యాప్తు సంస్థ పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..