Watch Video: ఇదేం రివెంజ్‌రా సామీ..! స్కూటీకి కట్టేశారని ఓనర్‌కి బుద్ధి చెప్పిన పెంపుడు కుక్క.. వైరల్ అవుతున్న వీడియో..

నిత్యం సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో పెంపుడు కుక్కలకు, పిల్లులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి. అవి చేసే చిలిపి పనులను వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేస్తుంటారు పెట్ లవర్స్. అయితే ఓ పెట్‌ లవర్‌పై

Watch Video: ఇదేం రివెంజ్‌రా సామీ..! స్కూటీకి కట్టేశారని ఓనర్‌కి బుద్ధి చెప్పిన పెంపుడు కుక్క.. వైరల్ అవుతున్న వీడియో..
Chained Dog Damaging Scooty Seat
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 24, 2023 | 8:43 AM

నిత్యం సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో పెంపుడు కుక్కలకు, పిల్లులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి. అవి చేసే చిలిపి పనులను వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేస్తుంటారు పెట్ లవర్స్. అయితే ఓ పెట్‌ లవర్‌పై తన పెంపుడు కుక్క రివెంజ్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ పెంపుడు కుక్క చేసిన పనికి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. ఇంకా రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

ఆ వీడియోలోని పెంపుడు కుక్క స్కూటీకి కట్టేసి ఉంటుంది. చూడడానికి పార్కింగ్ ఏరియాలాగా ఉన్న ఆ ప్రాంతంలో తన పెంపుడు కుక్కను స్కూటీకి కట్టేసి వెళ్లినట్లున్నారు. దీంతో ఆ కుక్కకు తిక్కరేగి తన ఓనర్ స్కూటీ సీట్‌ని కాలి గోర్లతో చించేయడం ప్రారంభించింది. ఇక ఆ పార్కింగ్ ఏరియాలోనే ఉన్న వ్యక్తి ఒకరు దీనికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. అలా నెట్టింట చెక్కర్లు కొడుతున్న వీడియోను తాజాగా discovery.engenharia అనే ఇన్‌స్టా ఖాతాదారు కూడా షేర్ చేశారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.  కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోని ఇక్కడ చూడండి..

మరోవైపు ఈ వీడియోను చూసిన నెటజన్లు పిచ్చపిచ్చగా నవ్వేసుకుంటున్నారు. వీరిలో ఓ నెటిజన్ ‘పాపం ఆ పెంపుడు కుక్క.. దాని ఓనర్ కోసం ఎదురు చూసి చూసి విసిగెత్తిపోయింది’ అంటూ సరదా కామెంట్ చేశాడు. ‘స్మార్ట్ రివెంజ్.. ఇలా చేస్తేనే ఓనర్స్ తమ పెంపుడు కుక్కలను కట్టేయకుండా ఉంటారు’ అని రాసుకొచ్చాడు మరో నెటిజన్. ఇలా పలువురు నెటజన్లు తమ తమ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. స్పందనలను  అలాగే ఈ వీడియోకి ఇప్పటివరకు 28 వేల లైకులు, 15 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇంకా పలువురు నెటిజన్లు వీడియోను తమ సన్నిహితులకు కూడా షేర్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!