Watch Video: తప్పించుకోలేవు ఇక..! ఆధారాలతో సహా పిల్లిని అరెస్ట్ చేసిన ఓనర్.. కారణం ఏమిటంటే..?

పిల్లులు చాలా తెలివైనవి ఇంకా గమ్మతైనవి కూడా. అందుకే చాలా మంది పిల్లులలో తమ సమయాన్ని గడపాలనుకుంటుంటారు. ఇక సోషల్ మీడియాలో పిల్లుల వీడియోలు కూడా నిత్యం వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా ఓ పెంపుడు పిల్లికి సంబంధించిన వీడియో నెట్టింట..

Watch Video: తప్పించుకోలేవు ఇక..! ఆధారాలతో సహా పిల్లిని అరెస్ట్ చేసిన ఓనర్.. కారణం ఏమిటంటే..?
Arrested Cat For Biting Things
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 24, 2023 | 9:14 AM

పిల్లులు చాలా తెలివైనవి ఇంకా గమ్మతైనవి కూడా. అందుకే చాలా మంది పిల్లులలో తమ సమయాన్ని గడపాలనుకుంటుంటారు. ఇక సోషల్ మీడియాలో పిల్లుల వీడియోలు కూడా నిత్యం వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా ఓ పెంపుడు పిల్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని పిల్లి ఆధారాలతో సహా తన ఓనర్‌కి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దీంతో ఆ ఓనర్ తన పెంపుడు పిల్లిని అరెస్ట్ చేసి, సంకెళ్లు వేశాడు.ఇక వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సాధారణంగా పెంపుడు పిల్లులు తమకు కనిపించిన ప్రతిదానిపైనా పంటి గాట్లు పెడుతుంటాయి. తన పిల్లి కూడా అలాగే చేస్తుందని, దాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టి అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు వీడియోలోని ఓనర్. దీంతో ఆ పిల్లి ముందు పళ్ల కొలతలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఏ వస్తువుల మీద పంటి గాట్లు ఉన్నాయో.. వాటిపై పిల్లి పంటి కొలతలతో సరిపోల్చాడు. అలా మూడు సార్లు సరిపోల్చగా.. కొలతలు సరిగ్గా సరిపోయాయి. దీంతో పంటి గాట్లు పెట్టింది పిల్లే అని అధారాలతో సహా తేలిపోయింది. అంతే.. వెంటనే తన పిల్లికి సంకెళ్లు వేసి అరెస్ట్  చేశాడు ఓనర్. దీనికి సంబంధించిన దృశ్యాలను మీరు వీడియోలో చూడవచ్చు

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోని ఇక్కడ చూడండి..

కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘పిల్లి తరఫున నేను లాయర్‌గా వాదిస్తాను. పిల్లికి బెయిల్ వెంటనే ఇప్పిస్తా’ అంటూ సరదాగా కామెంట్ చేశారు. అలాగే మరో నెటిజన్ వీడియోపై స్పందిస్తూ ‘ఆధారాలు సరిగ్గా సరిపోయాయి. అందుకు ఆ పిల్లికి కనీసం ఓ ప్యాకెట్ పాలను తాగే శిక్ష పడాలి’ అంటూ రాసుకొచ్చాడు. ‘పిల్లులను పెంచితే ఇలాంటివన్ని భరించాలి. అలా అరెస్ట్ చేసే హక్కు మీకు లేదు’ అంటూ తన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేశాడు. మరోవైపు ఈ వీడియోకి ఇప్పటివరకు 2 లక్షల 63 వేల లైకులు, అలాగే 62 లక్షల వీక్షణలు వచ్చాయి. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు వీడియోను షేర్ కూడా చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..