- Telugu News Photo Gallery Summer Tour: Best Places to visit in the ‘Happiest State’ Mizoram during your Summer Holidays
Summer Tour: అడ్వేంచర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే ‘సంతోషకర రాష్ట్రం’లోని ఈ ప్రాంతాలను ఓ సారి చుట్టేయండి..
మిజోరం పర్యాటక ప్రదేశాలు: దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్టంగా పేరున్న మిజోరం.. వేసవి సెలవుల కోసం ఉత్తమ ప్రదేశం. ఇక్కడ ఉండే పచ్చని ప్రకృతి అందాలు మనసును పర్యాటకులు మనసును ఎంతగానో ఆకర్షిస్తుంటాయి.
Updated on: Apr 24, 2023 | 7:25 AM

ఈశాన్య భారతంలోని సెవెన్ సిస్టర్ స్టేట్స్‌లో మిజోరం కూడా ఒకటి. ఇటీవలి కాలంలో ‘హ్యాపీయెస్ట్ స్టేట్’ గా పేరు పొందిన మిజోరం ప్రకృతి అందాలకు నిలయం వంటిది. ఈ రాష్ట్రంలోని పచ్చని లోయలు, అందమైన కొండ ప్రాంతాలు పర్యాటకుల మనసును ఆకర్షిస్తాయి. ఈ క్రమంలో మీరు ఇక్కడ సందర్శించి ఆనందించగల ప్రదేశాలేమిటో ఇప్పుడు ఓ సారి చూద్దాం..

తమ్దిల్ సరస్సు: మిజోరంలోని ఈ సరస్సు ఐజ్వాల్ నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని కొండలతో చుట్టి ఉన్న ఈ సరస్సును సందర్శించేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. పైగా ఇది విహారయాత్రకు అనువైన ప్రదేశం కూడా కావడంతో నిత్యం పర్యాటకులతో నిండి ఉంటుంది. మీరు ఇక్కడ బోటింగ్, ఫిషింగ్‌ని కూడా ఆనందించవచ్చు. ఇక్కడి స్వచ్ఛమైన నీరు, ప్రశాంత వాతావరణం మిమ్మల్ని పదే పదే మిజోరం వచ్చేలా చేస్తుంది.

ముర్లెన్ నేషనల్ పార్క్: మిజోరంలో ఉన్న మరో అందమైన పర్యాటక ప్రాంతం ముర్లెన్ నేషనల్ పార్క్. ఇది ఐజ్వాల్ నుంచి 245 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఇక్కడ అనేక రకాల పక్షులు మరియు సీతాకోక చిలుకలను చూడగలరు. ప్రకృతి ప్రేమికులకు ఇది చాలా మంచి ప్రదేశం.

దంప టైగర్ రిజర్వ్: వన్యప్రాణుల ప్రేమికులు ఈ దంప టైగర్ రిజర్వ్‌ని తప్పక సందర్శించాలి. ఇది మిజోరాం పశ్చిమ భాగంలో ఉంది. అంతరించిపోతున్న అనేక రకాల జీవజాతులకు ఈ ప్రాంతం నిలయమని చెప్పుకోవాలి. ఇందులో బెంగాల్ టైగర్, ఆసియాటిక్ బ్లాక్ బేర్ వంటివాటిని కూడా ఉన్నాయి. ఇవే కాకుండా అనేక రకాల పక్షులను కూడా చూడవచ్చు.

ఫాంగ్‌పుయ్ శిఖరం: ‘బ్లూ మౌంటైన్ పీక్’ అని కూడా ప్రసిద్ది పొందిన ఫాంగ్‌పుయ్ శిఖరం మిజోరాంలోనే ఎత్తైన శిఖరం. దీని చుట్టూ మీరు లోయలు, కొండల ఉత్కంఠభరితమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. మీ భాగస్వామితో సందర్శించేందుకు ఇది ఓ చక్కని ప్రదేశం.




