- Telugu News Photo Gallery Political photos Amit shah BJP Public meeting in chevella Telangana Photo gallery
Amit shah Telangana Tour: చేవెళ్లలో అమిత్ షా బహిరంగ సభ.. ఫొటోస్.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దే దింపే వరకూ బీజేపీ కార్యకర్తలు విశ్రమించరని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పేపర్ లీకేజ్‌పై ప్రశ్నించారని తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను జైల్లో పెట్టారని ఆరోపించారు. చేవెళ్ల విజయ సంకల్ప సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా
Updated on: Apr 24, 2023 | 12:08 PM

చేవెళ్లలో బీజేపీ నిర్హహించిన భారీ బహిరంగ సభలో అమిత్ షా

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దే దింపే వరకూ బీజేపీ కార్యకర్తలు విశ్రమించరని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పేపర్ లీకేజ్‌పై ప్రశ్నించారని తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను జైల్లో పెట్టారని ఆరోపించారు.

చేవెళ్ల విజయ సంకల్ప సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా మాట్లాడిన ప్రతి మాటా ఒక్కో తూటాలా పేలింది.

కేసీఆర్ అండ్ పరివార్ టార్గెట్‌గా ప్రశ్నల వర్షం కురిపించారు. కాషాయ శ్రేణులకు విజయోపదేశం చేస్తూనే కేసీఆర్ సర్కార్‌పై పంచ్ డైలాగులు పేల్చారు అమిత్‌షా.

బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికూపంలో కూరుకుపోయిందన్న షా.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గద్దె దిగడం ఖాయం.. బీజేపీ పవర్‌లోకి రావడం పక్కా అన్నారు.

ఓవైసీపైనా నిప్పులు చెరిగారు అమిత్ షా. అసలు కేసీఆర్ స్టీరింగే.. ఓవైసీ చేతిలో ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని హామీ ఇచ్చారు.

టీఎస్‌పీఎస్‌సీ, టెన్త్ పేపర్ల లీక్‌పైనా ప్రశ్నల వర్షం కురిపించారు అమిషా. నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడుకుంటారా అంటూ కేసీఆర్ సర్కార్‌పై చెలరేగిపోయారు అమిత్ షా.

జైళ్లకు వెళ్లేందుకు తమ పార్టీ నేతలు, కార్యకర్తలు భయపడరని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.

ఏం చెప్పాలనుకున్నారో? ఎవరిని విమర్శించాలనుకున్నారో? ఏ పాయింట్స్ రెయిజ్ చేయాలనున్నారో? సుత్తిలేకుండా స్ట్రెయిట్‌గా చెప్పారు అమిత్‌షా.





























