పిల్లల మైండ్ పవర్ పెంచే బెస్ట్ ఫుడ్ ఇదే!

Samatha

24  February 2026

పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా వారు చాలా చురుకుగా , తెలివితేటలు ఎక్కువగా ఉండాలి అనుకుంటారు.

పిల్లల ఆరోగ్యం

అందుకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ పిల్లల మేధస్సు పెరగడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే వారికి మంచి ఆహారం అందివ్వాలంట.

పిల్లల మేధస్సు

 పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగాలి అంటే తప్పకుండా పిల్లలకు కొన్ని రకాల ఫుడ్ అందించాలని చెబుతున్నారు నిపుణులు.  అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

జ్ఞాపకశక్తి పెరగడం

కోడి గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా కోలిన్ అనే పోషకం ఉండటం వలన ఇది మైండ్ పవర్ పెంచుతుందంట.

గుడ్లు

పిల్లలకు పెట్టాల్సిన ఆహారాల్లో పాలకూర తప్పనిసరి, ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఇది పిల్లల్లో తెలివితేటలను పెంచుతుదంట.

పాలకూర

వేరుశనగలను పిల్లల డైట్‌లో చేర్చడం వలన  వారిలో మెదడు పనితీరు మెరుగు పడి, జ్ఞాపక శక్తి పెరుగుతుందంట.

వేరుశనగలు

అదే విధంగా, సాల్మాన్ చేపలు రెగ్యూలర్‌గా పిల్లల డైట్‌లో చేర్చడం వలన ఇది జ్ఞాపక శక్తి పెరగడానికి దోహద పడుతుందంట.

ఫిష్

అలాగే,  బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ పిల్లల డైట్‌లో చేర్చడం చాలా మంచిది. ఇందులో ఉండే ఆంథోసైనిన్స్ వంటివి మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.

బెర్రీస్