స్వలింగ వివాహాల చట్టబద్ధతపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంచలన తీర్మానం..

స్వలింగ వివాహాలకు చట్ట బద్ధత కల్పించే విషయంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం జారీచేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి బదులు దానిపై చట్టం చేసే స్వేచ్ఛను శాసనవ్యవస్థకు విడిచిపెట్టడమే మేలని ప్రకటించింది.

స్వలింగ వివాహాల చట్టబద్ధతపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంచలన తీర్మానం..
Same Gender
Follow us
Aravind B

|

Updated on: Apr 24, 2023 | 10:14 AM

స్వలింగ వివాహాలకు చట్ట బద్ధత కల్పించే విషయంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం జారీచేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి బదులు దానిపై చట్టం చేసే స్వేచ్ఛను శాసనవ్యవస్థకు విడిచిపెట్టడమే మేలని ప్రకటించింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన పిటీషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువరించరాదని విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఏదైన నిర్ణయం తీసుకుంటే అది దేశ భవిష్యత్తు తరాలకు ప్రమాదంగా మారుతుందని తెలిపింది. ఆదివారం ఇక్కడ జరిగిన అన్ని రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్ల ఉమ్మడి సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది.

ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉన్న స్వలింగ వివాహాల కేసును చూసి దేశంలోని ప్రతి పౌరుడూ తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని బీసీఐ తెలిపింది. దాదాపు 99.9% మంది ప్రజలు స్వలింగ వివాహ ఆలోచనను వ్యతిరేకిస్తున్నారని పేర్కొంది. భారత్‌లోని సామాజిక, సాంస్కృతిక, మత విశ్వాసాలపై ప్రభావం చూపే ఇలాంటి సున్నతమైన విషయాల్ని చట్టసభల పరిశీలనకు వదిలిపెట్టడమే మంచిదని తెలిపింది. వాళ్లయితే విస్తృతమైన సంప్రదింపులు జరిపి సమాజ అభిప్రాయం, ప్రజల మనోగతానికి అనుగుణంగా తగిన నిర్ణయానికి రావడానికి వీలవుతుందంటూ తీర్మానించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..