ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. ఒకే యువతిని ప్రేమించిన ఇద్దరు విద్యార్థులు.. ఒకరు దారుణ హత్య
హత్య కేసులో నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. మరికొన్ని సెక్షన్లను నమోదు చేశారు. కారులో ఉన్న నాల్గవ విద్యార్థి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే, దీనిని ఎవరి రాజకీయ అనుబంధం ఆధారంగా చూడలేమని అధికార డిఎంకె పేర్కొంది. ఇది ఒక సామాజిక సమస్య, రాజకీయ సమస్య కాదు అని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ అన్నారు.

ట్రయాంగిల్ లవ్ కారణంగా నితిన్ హత్యకు గురైనట్టుగా పోలీసుల విచారణలో తేల్చారు. చంద్రు, వెంకటేశన్ అనే ఇద్దరు విద్యార్థులు ఒకే యువతిని ప్రేమించారు. అందులో ఒక ప్రేమికుడు చంద్రు.. ప్రత్యార్థి వర్గానికి చెందిన వారిని బెదిరించాలని డిఎంకె కౌన్సిలర్ మనవడి సహాయం కోరాడు. దీంతో సోమవారం వారు కారులో బయలుదేరి.. ప్రత్యర్థి వర్గం రెండు బైక్‌లపై వెళ్తుండగా వారిని కారుతో వెనుకనుండి ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రత్యర్థి ప్రేమికుడు వెంకటేశన్ స్నేహితుడు నితిన్ సాయి(19) తలకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవింగ్ చేస్తున్న అభిషేక్ గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.
హత్య కేసులో నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. మరికొన్ని సెక్షన్లను నమోదు చేశారు. కారులో ఉన్న నాల్గవ విద్యార్థి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే, దీనిని ఎవరి రాజకీయ అనుబంధం ఆధారంగా చూడలేమని అధికార డిఎంకె పేర్కొంది. ఇది ఒక సామాజిక సమస్య, రాజకీయ సమస్య కాదు అని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ అన్నారు.
“కానీ వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాలనుకుంటున్నారు. మనం బిజెపి మరియు ఎఐఎడిఎంకె నేరస్థులను వదిలేస్తే, వారు సంతోషంగా ఉండవచ్చు” అని ఆయన అన్నారు. ఇటువంటి నేరాలలో అరెస్టు అయిన చాలా మంది బీజేపీ, ఏఐఏడీఎంకేలకు చెందినవారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…