- Telugu News Photo Gallery Surprising Benefits of Jeera Water in the Morning You Would Want to Know In Telugu
ఒక్క నెలపాటు ఉదయాన్నే ఇలా జీలకర్ర నీరు తాగండి.. శరీరానికి ఆరోగ్య మంత్రం వేసినట్టే..!
జీలకర్ర నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఇది దివ్యౌషధంగా భావిస్తారు. ముందుగా, జీలకర్ర నీటిని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. 1-2 టేబుల్ స్పూన్ల జీలకర్రను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఆ నీటిని మరిగించి, చల్లబరచండి ఆ తరువాత వడకట్టి తాగాలి. రుచి కోసం మీరు కావాలంటే దీనికి కొద్దిగా తేనె యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒక నెల పాటు ప్రతిరోజూ ఉదయం జీలకర్ర నీటిని తాగటం వల్ల మీ ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ పూర్తి డిటెల్స్ ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: Jul 31, 2025 | 7:18 AM

జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఉబ్బరం, పేగు సమస్యలను తగ్గిస్తుంది. ఇది అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. మీ పెరుగుతున్న బరువును తగ్గించడంలో కూడా జీలకర్ర నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

జీలకర్ర నీరు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీలకర్ర నీరు జీవక్రియను పెంచుతుంది. తద్వారా కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. జీలకర్ర నీటిని తరచుగా తాగడం వల్ల ఆకలిని నియంత్రించవచ్చు. జీలకర్ర నీటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి.

భోజనం తర్వాత సోంపు తినే అలవాటు జీర్ణక్రియను మెరుగుపడుతుంది. అదే విధంగా రాత్రంతా నానబెట్టిన సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగినా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయట. సోంపు నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు నోటి దుర్వాసన తగ్గుతుంది. బరువు తగ్గడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

జీలకర్ర నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్ కణాల నుండి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ కాంతిని పెంచుతాయి. మొటిమలు, నల్ల మచ్చలను తగ్గిస్తాయి. జుట్టును బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. శరీరంలో వాపు లేదా రక్తం తక్కువగా ఉన్నవారు కూడా జీలకర్ర నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. జీలకర్ర నీరు బహిష్టు సమయంలో నొప్పి, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా ఒక నెలరోజుల పాటు తాగటం వల్ల శరీరంలో మ్యాజిక్‌లాంటి ప్రయోజనాలు కనిపిస్తాయి.




