AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money: రోడ్డు మీద డబ్బులు దొరికితే తీసుకోవచ్చా లేదా..? అలా చేస్తే ఏమౌతుందంటే..

రోడ్డు దొరికిన డబ్బును కొంతమంది తీసుకుని సొంత ఖర్చులకు వాడుకుంటారు. మరికొందరు బిచ్చగాళ్లకు వేస్తుంటారు. లేదంటే, గుడిలో విరాళంగా ఇస్తుంటారు. అయితే, ఇటీవల, బృందావనంలోని ప్రసిద్ధ సాధువు ప్రేమానంద్ జీ మహారాజ్ రోడ్డుపై డబ్బు కనిపిస్తే ఏం చేయాలో చెప్పారు. రోడ్డు మీద దొరికిన డబ్బును మన దగ్గరే ఉంచుకోవాలా అని ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రేమానంద్ జీ మహారాజ్ ఇలా వివరణ ఇచ్చారు..

Money: రోడ్డు మీద డబ్బులు దొరికితే తీసుకోవచ్చా లేదా..? అలా చేస్తే ఏమౌతుందంటే..
Money On Road
Jyothi Gadda
|

Updated on: Aug 01, 2025 | 10:36 AM

Share

అప్పుడప్పుడు మనకు రోడ్డు మీద చిల్లర నాణేలు, కరెన్సీ నోట్లు కూడా పడిపోయి దొరుకుతుంటాయి. అలా రోడ్డు మీద డబ్బులు దొరకడం కొందరు శుభ సూచకంగా భావిస్తారు. మరికొందరు, నష్టానికి సంకేతంగా భావిస్తారు. అలా దొరికిన డబ్బును కొంతమంది తీసుకుని సొంత ఖర్చులకు వాడుకుంటారు. మరికొందరు బిచ్చగాళ్లకు వేస్తుంటారు. లేదంటే, గుడిలో విరాళంగా ఇస్తుంటారు. అయితే, ఇటీవల, బృందావనంలోని ప్రసిద్ధ సాధువు ప్రేమానంద్ జీ మహారాజ్ రోడ్డుపై డబ్బు కనిపిస్తే ఏం చేయాలో చెప్పారు. రోడ్డు మీద దొరికిన డబ్బును మన దగ్గరే ఉంచుకోవాలా అని ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రేమానంద్ జీ మహారాజ్ ఇలా వివరణ ఇచ్చారు..

రోడ్డు మీద దొరికిన డబ్బును మీ దగ్గరే ఉంచుకోకూడదని ప్రేమానంద్‌ జీ మహారాజ్‌ వెల్లడించారు. ఎందుకంటే ఈ డబ్బు వేరొకరిది.. దానిని తీసుకోవడం, ఖర్చు చేసుకోవడం సరైనది కాదని అన్నారు. రోడ్డు మీద డబ్బు దొరకడం శుభసూచకంగా భావిస్తారని, కానీ దానిని తీసుకొని తన దగ్గర ఉంచుకోకూడదని మహారాజ్ జీ చెప్పారు. ఎందుకంటే అలా చేయడం ఒకరి డబ్బును దొంగిలించినట్లే అవుతుందని ఆయన అన్నారు.

మీరు రోడ్డుపై డబ్బు దొరికితే దాన్ని తీసుకొని మీ దగ్గర ఉంచుకుంటే లేదా మీ అవసరాలకు ఖర్చు చేస్తే మీరు పాపం చేసినట్టే అవుతుంది.. కాబట్టి దారిలో దొరికిన డబ్బును తీసుకుని మీ సొంత ఖర్చులకు వాడకుండా దానిని మతపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించాలి లేదా ఆలయానికి దానం చేయాలని ప్రేమానంద్‌ జీ మహారాజ్‌ వెల్లడించారు. అంతేకాకుండా, రోడ్డు మీద దొరికిన డబ్బుతో ఆవులకు సేవ చేసినా కూడా మీకు పుణ్యం లభిస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

రోడ్డు మీద దొరికిన డబ్బును ఆవు లేదా మరే ఇతర జీవికి సేవ చేయడానికి ఉపయోగిస్తే, ఇద్దరూ దాని నుండి ప్రయోజనం పొందుతారు. అంటే డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి, అలా ఒకరు పొగొట్టున్న డబ్బు దొరికిన వ్యక్తి కూడా అంటున్నారు ప్రేమానంద్‌ జీ మహారాజ్.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..