AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holiday August 2025: ఆగస్టులో అన్నీ ప్రభుత్వ సెలవులే..! బ్యాంక్‌ పనులుంటే ముందే ప్లాన్‌ చేసుకోండి..

అమ్మో.. ఒకటో తారీఖు అన్నట్టుగానే ఆగస్టు నెల అప్పుడే వచ్చేసింది. శ్రావణ మాసం ఆరంభంతో ఇక అన్ని పండుగలు, పర్వదినాలు మొదలైనట్టే. ఆగస్టు నెల ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం రెట్టింపు సంతోషాన్నిచ్చేదిగా చెప్పాలి. ఎందుకుంటే.. ఈ ఆగస్టులో చాలా ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. ఈ నెలలో ఆరు, ఏడు రోజులు కాదు ఏకంగా, 15 రోజులు బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. ప్రభుత్వ సెలవులతో పాటు ఈ సెలవుల్లో రెండవ-నాల్గవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఆ పూర్తి డిటెల్స్‌ ఇక్కడ తెలుసుకుందాం...

Bank Holiday August 2025: ఆగస్టులో అన్నీ ప్రభుత్వ సెలవులే..! బ్యాంక్‌ పనులుంటే ముందే ప్లాన్‌ చేసుకోండి..
Bank Holidays
Jyothi Gadda
|

Updated on: Aug 01, 2025 | 9:15 AM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం.. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద ప్రతి సంవత్సరం బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ చట్టం ప్రకారం.. చెక్కులు, ప్రామిసరీ నోట్స్ వంటి పత్రాల ప్రాసెసింగ్ కూడా సెలవు దినాలలో జరగదు. అటువంటి పరిస్థితిలో మీకు ఈ నెలలో బ్యాంకులో ఏదైనా పని ఉంటే, ముందుగానే ఈ బ్యాంకు సెలవుల డిటెల్స్‌ తెలుసుకోవటం మంచిది. ఇది మీ సమయాన్ని, డబ్బును కూడా ఆదా చేసేందుకు తోడ్పడుతుంది.

ఆగస్టు 2025 సెలవుల పూర్తి జాబితా:

ఆగస్టు 8, 13 తేదీల్లో బ్యాంకులకు సెలవులు: ఆగస్టు 8 రక్షా బంధన్ రాజస్థాన్, ఉత్తరాఖండ్, యూపీలో బ్యాంకులకు సెలవు. టెండోంగ్ లో రమ్ ఫట్ సందర్భంగా ఆగస్టు 8 (శుక్రవారం) సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి. ఆగస్టు 13 (బుధవారం) దేశభక్తి దినోత్సవ వేడుకల సందర్భంగా మణిపూర్‌లోని ఇంఫాల్‌లో మాత్రమే బ్యాంకులు మూసివేయబడతాయి.

ఇవి కూడా చదవండి

ఆగస్టు 9న బ్యాంకులకు సెలవులు: ఆగస్టు 9 – రెండో శనివారం. అనేక రాష్ట్రాల్లో రక్షా బంధన్, ఝులన్ పూర్ణిమ పండుగలు జరుపుకుంటారు. అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, డెహ్రాడూన్, జైపూర్, కాన్పూర్, లక్నో, సిమ్లాలలో బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే, ఈ పండుగ రెండవ శనివారం కావడంతో, ఈ రాష్ట్రాల్లోని బ్యాంకులు సాధారణ వారాంతపు సెలవు ప్రకారం మూసివేయబడతాయి.

ఆగస్ట్​ 10 : ఆదివారం కావటంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.

ఆగస్ట్​ 13 : బుధవారం ఇంఫాల్ (మణిపూర్)లోని బ్యాంకులకు పేట్రియాట్ దినోత్సవం సందర్భంగా సెలవు.

ఆగస్టు 15: శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం, పార్సీ నూతన సంవత్సరం (షహెన్షాహి), జన్మాష్టమి వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.

ఆగస్ట్​ 16 : శనివారం అహ్మదాబాద్ (గుజరాత్), ఐజ్వాల్ (మిజోరం), భోపాల్, రాంచీ (మధ్యప్రదేశ్), చండీగఢ్ (యూటీ), చెన్నై (తమిళనాడు), డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), గ్యాంగ్‌టక్ (సిక్కిం), హైదరాబాద్ (తెలంగాణ), జైపూర్ (రాజస్థాన్), కాన్పూర్, లక్నో (ఉత్తరప్రదేశ్), పాట్నా (బీహార్), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), షిల్లాంగ్ (మేఘాలయ), జమ్ము, శ్రీనగర్, విజయవాడ (ఆంధ్రప్రదేశ్)లోని బ్యాంకులకు జన్మాష్టమి సందర్భంగా సెలవు.

ఆగస్టు 19- 25 తేదీలలో బ్యాంకులకు సెలవులు: మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి సందర్భంగా ఆగస్టు 19, మంగళవారం నాడు అగర్తలాలో బ్యాంకులు మూసివేయబడతాయి. శ్రీమంత శంకరదేవుని తిరుభవ తిథి కారణంగా ఆగస్టు 25, శుక్రవారం అస్సాంలోని గౌహతిలో బ్యాంకులు మూసివేయబడతాయి .

ఆగస్టు 27, 28 తేదీల్లో బ్యాంకులకు సెలవులు: ఆగస్టు 27 (బుధవారం) గణేష్ చతుర్థి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, గుజరాత్, మిజోరం, మధ్యప్రదేశ్, చండీగఢ్, జార్ఖండ్, మేఘాలయ, శ్రీనగర్ ఇతర రాష్ట్రాలు దాదాపు దేశవ్యాప్తంగా బ్యాంకులు సెలవు ప్రకటించాయి.

ఆగస్టు 28న నువాఖై సందర్భంగా పంట పండుగ నువాఖై కోసం భువనేశ్వర్, ఒడిశా మరియు పనాజీ, గోవాలో బ్యాంకులు మూసివేయబడతాయి.

ఆగస్టు 31 – ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు తెలిసిందే.

ఇకపోతే, తీజ్, హర్తాలికా, ఓనం వంటి స్థానిక పండుగల ఆధారంగా ఇతర ప్రాంతీయ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి వర్తిస్తుంది.

ఆన్‌లైన్ సేవలు: బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్‌డ్రా వంటి ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్‌ చెకింగ్‌, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌లు యదావిధిగానే చేసుకోవచ్చు. కానీ, ఆన్‌లైన్‌ మోసాల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత తప్పనిసరిగా మీ మీదే ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..