Covid-19: ఆ 3 రాష్ట్రాల్లో 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు.. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
దేశంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. మరో వారం రోజుల్లో థర్డ్ వేవ్ ఉధృతి మరింత తగ్గుముఖంపట్టే అవకాశముందని అంచనావేస్తున్నారు.
India Covid-19 Acive Cases: దేశంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ ఉధృతి గత వారంతో పోల్చితే కాస్త తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. మరో వారం రోజుల్లో థర్డ్ వేవ్(Covid-19 Third Wave) ఉధృతి మరింత తగ్గుముఖంపట్టే అవకాశముందని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. గత వారం వారం రోజులుగా ప్రతి రోజూ సరాసరిగా 3 లక్షల కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్ ఉధృతి తగ్గుతున్న సంకేతాలు వెలువడున్నా.. దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఇంకా మూడు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండటం కాస్త ఆందోళనకు గురిచేసే అంశం. దేశంలో ప్రస్తుతం 22 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. దేశంలో కోవిడ్ పరిస్థితిపై గురువారంనాడు మీడియాకు వివరాలు వెల్లడించిన ఆరోగ్య శాఖ అధికారులు.. దేశంలోని 11 రాష్ట్రాల్లో 50 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు. వీటిలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.
అలాగే 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 10 వేల నుంచి 50 వేల లోపు యాక్టివ్ కేసులు ఉన్నాయి. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 10 వేల లోపు యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత వారం దేశంలో సరాసరి పాజిటివిటీ రేటు 17.75శాతంగా ఉంది. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో 77శాతం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
~22 lakh active cases exist in the country as of today
Around 3 lakh daily #COVID19 cases were reported daily in the last week. Infection spread is still being noted to be quite high
Overall case positivity across India in the last week was around 17.75%
-JS, @MoHFW_INDIA pic.twitter.com/wkoEk0KjTW
— PIB India (@PIB_India) January 27, 2022
కేంద్ర ఆరోగ్య శాఖ గురువారంనాడు విడుదల చేసిన గణాంకాల మేరకు గత 24 గం.ల వ్యవధిలో దేశంలో 2,86,384 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 22,02,472కు చేరుకుంది. ఇదిలా ఉండగా దేశంలో ఇప్పటి వరకు 163.84 కోట్ల డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
More than 163.84 Crore total doses administered have been administered so far
Population aged 18 years and above 1st dose: 88.98 crore (95%) 2nd dose: 69.52 crore (74%) Precaution Dose: 97.03 Lakh
Population aged 15-18 years 1st dose: 4.37 crore (59%)
-JS, @MoHFW_INDIA pic.twitter.com/czQS8Q6NXS
— PIB India (@PIB_India) January 27, 2022
Also Read..
Hyderbad News: మద్యం మత్తులో యువతి వీరంగం.. రోడ్డుపై వెళ్తున్న వారిని తన కారుతో..
Hyderabad: చెత్త కింద చారిత్రక నిర్మాణం.. హైదరాబాద్‌లో బయటపడిన పురాతన కట్టడం..!