Covid-19 Third Wave: థర్డ్ వేవ్ మొదలైపోయింది.. పీక్స్‌కు చేరేది ఎప్పుడంటే..? ఇది నిపుణుల మాట

Covid-19 Third Wave: థర్డ్ వేవ్ మొదలైపోయింది.. పీక్స్‌కు చేరేది ఎప్పుడంటే..? ఇది నిపుణుల మాట
Third Wave

Coronavirus Third Wave: ప్రపంచవ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం..లక్షల్లో కేసులు.. అయితే ముందుముందు పెను విపత్తు ముంచుకొస్తోందా..? గతంలో ఎన్నడూ లేని విధంగా ఒమిక్రాన్‌

Shaik Madarsaheb

|

Jan 06, 2022 | 7:10 PM

Coronavirus Third Wave: ప్రపంచవ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం..లక్షల్లో కేసులు.. అయితే ముందుముందు పెను విపత్తు ముంచుకొస్తోందా..? గతంలో ఎన్నడూ లేని విధంగా ఒమిక్రాన్‌ ప్రళయం సృష్టించబోతోందా..? రానున్న రోజులన్నీ వెరీ వెరీ డేంజరస్సేనా..? అంటే భయంకర వాస్తవాలను మన కళ్ల ముందుంచుతున్నారు నిపుణులు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా..జరగబోయే విపత్తును ఊహించలేమంటున్నారు. ఫిబ్రవరిలో కరోనా పీక్స్‌కు చేరుతుందట. ఈ నెల రోజులు అత్యంత కీలకమంటున్నారు వైద్య నిపుణులు. ఫిబ్రవరిలో కొవిడ్‌ అల్లకల్లోలం సృష్టించడం ఖాయమంటున్నారు. అంటే ఇప్పటికే ఒక్కరోజులోనే లక్ష కేసులు నమోదవుతున్నాయి. ఇక ఫిబ్రవరిలో పీక్స్‌కు అంటే కేసులు ఎలా ఉంటాయో కూడా ఊహించడం కష్టమేనంటున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ షురూ అయిపోయింది. సెకండ్‌ వేవ్‌కు మించి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ఎన్నడూ లేని విధంగా రాకెట్‌ వేగంతో పరుగులు పెడుతోంది. కేవలం 4 రోజుల్లోనే లక్షకు చేరాయి కొవిడ్‌ కేసులు. 24 గంటల్లోనే 90వేల 928 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 325 మంది కరోనా కాటుకు బలయ్యారు. యాక్టివ్‌ కేసులు 2,85,401కి చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా 26వేలకు పైగా కొవిడ్‌ కేసులు నమోదవగా..8 మంది మృతి చెందారు. ఇక డైలీ పాజిటివిటీ రేటు 6.43 శాతంగా ఉంది. ఇక అంతకు మించి అన్నట్టుగా ఒమిక్రాన్‌ కూడా విలయం సృష్టిస్తోంది. అంతకంతకూ కేసులు పెరిగిపోతున్నాయి. డిసెంబర్‌ 21న 200 ఒమిక్రాన్‌ కేసులుంటే..ఇవాళ 2,630కి చేరాయి. అంటే కేవలం 15 రోజుల్లోనే 2,430కేసులు వెలుగులోకొచ్చాయి. దీన్ని బట్టి ఒమిక్రాన్‌ ఏ స్థాయిలో వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రమంలో కోవిడ్ టాస్క్‌‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి కీలక ప్రకటన చేశారు. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటే.. ప్రమాదం అంతగా ఉండదని పేర్కొన్నారు. అప్పుడు లక్షాణాలు లేని వ్యక్తులు కూడా పరీక్షలకు దూరంగా ఉండచ్చని తెలిపారు. మనమంతా కోవిడ్, వాటి వేరియంట్‌లతో జీవించడం నేర్చుకోవాలంటూ జోషి పేర్కొన్నారు. దాదాపు 15 రోజుల క్రితమే దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని పేర్కొన్నారు. జనవరి 15 నుంచి ఫిభ్రవరి 15 వరకు కరోనా థర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లోనే మిలియన్ కేసులు నమోదు అవుతాయని పేర్కొన్నారు. తాజా పరిస్థితులను పరిశీలిస్తే.. దేశం థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. మన ఆసుపత్రుల్లోని దాదాపు 80శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అనేక అధ్యయనాలు.. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాయని.. అదే జాగ్రత్త ముందుకు సాగాలన్నారు. అధ్యయనాలతో పోల్చుకుంటే.. తీవ్రత తక్కువగానే ఉన్నట్లు తెలిపారు.

ఇక ఒమిక్రాన్‌ ధాటికి ప్రపంచదేశాలన్నీ విలవిలలాడిపోతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా రోజుకు లక్షల్లో నమోదవుతున్న కేసులతో అల్లాడిపోతోంది. తాజాగా 24 గంటల్లో 7లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక ఫ్రాన్స్‌లోనూ సేమ్‌ సీన్‌. న్యూ వేరియంట్‌ ఇహూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో అక్కడ ఒక్కరోజులోనే 3లక్షల మందికి పైగా కరోనా సోకింది.

కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలు చేపట్టాయి. ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయితే.. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కేసులు పెరుగుతున్నాయన్నది వాస్తవం. మనం బ్రతకాలంటే జాగ్రత్తలు మస్ట్‌. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నా..ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు. మాస్క్‌ ధరించడం, ఫిజికల్‌ డిస్టెన్స్‌ కంపల్సరీ. లేదంటే భారీ మూల్యం తప్పదంటున్నారు వైద్య నిపుణులు.

Also Read:

UPSC Mains 2021: వాయిదా ప్రసక్తేలేదు.. షెడ్యూల్ ప్రకారమే యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు..

Coronavirus: కరోనా టెర్రర్.. ఫ్లైట్ లో ప్రయాణించిన 170 మందిలో125 మందికి పాజిటివ్‌..! ఎయిర్ ఇండియా క్లారిటీ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu